English | Telugu
పెళ్లిపీటలెక్కనున్న సాయి ధరమ్ తేజ్.. వధువు ఎవరు..?
Updated : Nov 17, 2025
త్వరలో సాయి ధరమ్ తేజ్ పెళ్ళి
తిరుమలలో పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో
టాలీవుడ్ లోని బ్యాచిలర్ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈ 39 ఏళ్ళ మెగా హీరో.. ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సాయి తేజ్ చెప్పడం విశేషం. (Sai Dharam Tej)
'త్వరలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి' అంటూ ఎప్పటినుండో వార్తలొస్తున్నాయి. కానీ, ఆ వార్తలు వార్తలుగానే మిగిలిపోతున్నాయి. అయితే ఈసారి మాత్రం వేడుకగా మారనుంది. తాజాగా తిరుమలలో తన పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చారు సాయి తేజ్.
తాజాగా తిరుమల శ్రీవారిని సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి సినిమాలు, మంచి జీవితాన్ని ఇచ్చిన స్వామి వారికి కృతఙ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చానని చెప్పారు. అలాగే, నూతన సంవత్సరం వస్తున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నాను. వచ్చే ఏడాది నేను నటించిన 'సంబరాల ఏటిగట్టు' సినిమా విడుదలవుతుంది. దానిని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
ఈ సందర్భంగా, మీ పెళ్ళి గురించి వార్తలు వస్తున్నాయి కదా అని ఒక రిపోర్టర్ అడగగా.. వచ్చే ఏడాది నా పెళ్ళి ఉంటుందని సాయి ధరమ్ తేజ్ సమాధానమిచ్చారు.
Also Read:బాలకృష్ణకు ఐపీఎస్ అధికారి క్షమాపణలు
మొత్తానికి వచ్చే ఏడాది మెగా హీరో సాయి తేజ్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. దీంతో వధువు ఎవరనే చర్చ ఆసక్తికరంగా మారింది.
గతంలో ఒక హీరోయిన్ తో సాయి తేజ్ ప్రేమలో ఉన్నట్లు గాసిప్స్ వినిపించాయి. మరి ఈ హీరో.. ప్రేమ పెళ్ళి చేసుకుంటారో? లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటారో? చూడాలి.