English | Telugu
నా క్యారక్టర్ ని పుష్ప తో పోల్చవద్దు.. పృథ్వీరాజ్ సుకుమారన్ అభ్యర్ధన
Updated : Nov 17, 2025
-పుష్ప తో పోల్చకండి
-విలయాత్ బుద్ద తో హిట్ కొట్టబోతున్నాడా!
-ssmb 29 లో ఎలాంటి క్యారక్టర్
-అభిమానుల్లో భారీ అంచనాలు
సినిమా కోసమే పుట్టిన పాన్ ఇండియా కట్ అవుట్ 'పృథ్వీరాజ్ సుకుమారన్'(Prithviraj Sukumaran)హీరోగానే కాకుండా ఇతర హీరోల చిత్రాల్లోను ముఖ్య పాత్రలు పోషిస్తు తనదైన హవాని కొనసాగిస్తున్నాడు. పైగా ఆ చిత్రాలన్నీ ఆషామాషి చిత్రాలు కాదు. పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నవి. మేకర్స్ కూడా ఏరికోరి పృథ్వీ రాజ్ సుకుమారన్ ని తమ సినిమా కోసమే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న మహేష్, రాజమౌళిల 'వారణాసి'(Varanasi)నే అందుకు ఉదాహరణ. పృథ్వీరాజ్ హీరోగా ఈ నెల 21 న 'విలయాత్ బుద్ద'(Vilaayath Buddha)అనే మలయాళ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్నాడు. ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది. ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండటంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పృథ్వీరాజ్ ఈ మూవీలో గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పటీనుంచే పుష్ప కి కాపీ అనే విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి. టీజర్ లో సైతం 'నువ్వు పుష్ప అనుకుంటున్నావా' అనే డైలాగ్ ని కూడా చెప్పడం జరిగింది. రీసెంట్ గా 'విలయాత్ బుద్ద' ట్రైలర్ రిలీజయ్యింది.దీంతో మళ్ళీ పుష్ప కి కాపీ అనే విమర్శలు సోషల్ మీడియా వేదికగా జోరందుకున్నాయి. ఈ విషయంపై పృథ్వీ రాజ్ మాట్లాడుతు నా చిత్రానికి పుష్ప తో ఎలాంటి క్రియేటివ్ లింక్ లేదు. మూవీలోని నా క్యారక్టర్ 'డబుల్ మోహనన్'కి, 'పుష్ప రాజ్'కి ఎటువంటి పోలిక లేదు.
also read: సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున భేటీ.. అభిమానుల్లో పండుగ వాతావరణం
రెండు చిత్రాలు గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కడంతో పోలికలు సహజం. అయితే కథలు పూర్తిగా భిన్నమైనవి. జీ ఆర్ ఇందుగోపన్ రాసిన విలాయత్ బుద్ధ అనే మలయాళ నవల ఆధారంగా 'విలయాత్ బుద్ద రూపొందించబడింది. గతంలోను విలాయత్ బుద్ధ కి పుష్ప కి సంబంధం లేదని పృథ్వీరాజ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక విలాయత్ బుద్ధ' ని జయన్ నంబియార్(Jayan Nambiar) దర్శకత్వం వహించగా సేనాన్, అనూప్ నిర్మించారు. ప్రియం వద కృష్ణన్ హీరోయిన్ కాగా షమ్మీ, సూరజ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జెక్స్ బిజోయ్ మ్యూజిక్ ని అందించాడు.