English | Telugu
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా రామ్‌చరణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Updated : Sep 14, 2021
దేశంలోని లీడింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు స్టార్ యాక్టర్ రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఆయన దానికి సంబంధించిన యాడ్స్‌లో నటించాడు. త్వరలో అవి టెలివిజన్‌లో ప్రసారం కానున్నాయి. ఒక బయటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ఒక తెలుగు యాక్టర్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంపికవడం ఇదే తొలిసారి. 'ఆహా'కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అయితే అందులో ఆయన తండ్రి అల్లు అరవింద్ మేనేజింగ్ పార్టనర్ కాబట్టి, అది ఆయన సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ కింద లెక్క.
కాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో రామ్‌చరణ్ కుదుర్చుకున్న ఒప్పందం గురించి సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ డీల్ ద్వారా ఆయనకు ఏకంగా రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుతోందని రూమర్స్ వచ్చాయి. అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదనీ, చరణ్‌కు ఈ డీల్ ద్వారా ఒక కోటి రూపాయలు మాత్రమే ముడుతున్నాయనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇండియాలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. వాటికంటే ముందుండాలనే లక్ష్యంతో స్టార్ యాక్టర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. త్వరలో రామ్‌చరణ్‌ను తమ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంపిక చేసుకున్నామనే విషయాన్ని తెలపడానికి త్వరలో హైదరాబాద్‌లో ఒక ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.