English | Telugu
Akhanda 2: తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్ లో బాలయ్య తాండవం
Updated : Dec 11, 2025
-బుకింగ్స్ లో జోరు కొనసాగిస్తున్న బాలయ్య
-కలెక్షన్స్ పై ఆసక్తి
-అభిమానుల హంగామా
నందమూరి అందగాడు, బాక్స్ ఆఫీస్ బొనాంజా, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna)చేసే శివ తాండవంతో థియేటర్స్ ఊగిపోవడానికి సర్వం సిద్దమయ్యింది. ఈ రోజు నైట్ తొమ్మిది గంటల నుంచే బెనిఫిట్ షోస్ ప్రదర్శిస్తుండటంతో అభిమానుల్లో అయితే పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఆన్ లైన్ లో బెనిఫిట్ షోస్ టికెట్స్ ని ఉంచడం ఆలస్యం బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచే ఆన్ లైన్ వేదికగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావడంతో హెవీ క్రౌడ్ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. సదరు క్రౌడ్ పై బాలయ్య బాక్స్ ఆఫీస్ పై చేస్తున్న సర్జికల్ స్ట్రైక్ అంటూ మేకర్స్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇపుడు అదే రీతిలో నిన్న నైట్ తెలంగాణ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి . ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేక్ లా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఎంతలా అంటే ఎన్ని షోస్ ని అయితే ఆన్ లైన్ లో ఉంచారో అన్ని షోస్ సింగల్ స్క్రీన్, మల్టి ప్లెక్స్ అనే తేడా లేకుండా ఫుల్ అవుతున్నాయి.
also read: అడ్వాన్స్ బుకింగ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న అఖండ 2
దీంతో అభిమానులు, సినీ విశ్లేషకులు స్పందిస్తూ అఖండ 2(Akhanda 2)ద్వారా బాలయ్య సృష్టించబోయే సునామీకి ఇదొక నిదర్శనం అని, పాన్ ఇండియా వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ లో అఖండ 2 ద్వారా సంచలనం నమోదు కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ కూడా రన్ అవుతుండటంతో బాలయ్య సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. బోయపాటి, బాలయ్య కాంబోకి ఉన్న ట్రాక్ రికార్డు కూడా అఖండ 2 కి అదనపు బలం.