English | Telugu
తమిళనాడులో 400.. కేరళలో 250.. 'పుష్ప' స్క్రీన్స్!
Updated : Dec 15, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ 'పుష్ప' మూవీతో వేరే రేంజ్‌కు వెళ్తుందని ఆయన ఫ్యాన్స్‌తో పాటు, ఆయన కూడా స్వయంగా నమ్ముతున్నాడు. అందుకే పుష్పను తన కెరీర్‌కు సంబంధించి గేమ్ చేంజర్ అవుతుందని నమ్మకంగా చెప్పాడు. అంతేకాదు, "నటుడిగా నేను అన్వేషించాల్సింది చాలా ఉంది. 'పుష్ప' ప్రారంభం మాత్రమే." అని ఆయన అన్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప' తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజవుతూ బన్నీకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా నిలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందనంగా అగ్రెసివ్‌గా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు బన్నీ.
Also read:యూట్యూబ్‌లో రెచ్చిపోతున్న సమంత "ఊ అంటావా మావా" సాంగ్!
రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్ జరగగా, నిన్న అక్కడే మీడియాతో ఇంటరాక్ట్ అయిన బన్నీ, ఈరోజు హీరోయిన్ రష్మికతో కలిసి చెన్నై, కొచ్చిలలో మీడియా మీట్‌లలో పాల్గొంటున్నాడు. ఇప్పటికే కేరళలో బన్నీకి మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ హీరోల్లో ఏ హీరోనూ ఆదరించని రీతిలో ఆయనను మలయాళీలు ఆదరిస్తున్నారు. అందుకే అక్కడ 'పుష్ప' 250 థియేటర్లలో విడుదలవుతోంది. కేరళలో 'పుష్ప'ను రూ. 4 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేశారు.
Also read:'పుష్ప' కోసం శేషాచలం ఎర్రచందనాన్ని మారేడుమిల్లి అడవుల్లో సృష్టించింది ఈ జంటే!
ఇక తమిళనాడులో 'పుష్ప' ప్రి రిలీజ్ బిజినెస్ వాల్యూ రూ. 6 కోట్లు. అక్కడ కూడా భారీ స్థాయిలో 400కు పైగా స్క్రీన్స్‌లో సినిమా రిలీజవుతోంది. కోయంబత్తూర్‌లోని ఒక థియేటర్ వద్ద 'పుష్ప'లో బన్నీ నిలువెత్తు కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటుచేశారంటే.. అక్కడ కూడా ఆయన క్రేజ్ పెరిగిందనడానికి నిదర్శనంగా చెప్తున్నారు. ఓవరాల్‌గా ప్రస్తుతం 'పుష్ప' మేనియా నడుస్తోంది.