English | Telugu
అప్పుడు బాలయ్యతో.. ఇప్పుడు తారక్ తో!
Updated : Dec 15, 2021
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన నిర్మాతల్లో డీవీవీ దానయ్య ఒకరు. త్వరలో ఈ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ `ఆర్ ఆర్ ఆర్`తో పలకరించబోతున్నారు. `బాహుబలి` సిరీస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటించారు. 1920ల కాలం నాటి కథతో ఫిక్షనల్ మూవీగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందింది.
ఇదిలా ఉంటే.. తారక్ తో దానయ్యకిదే మొదటి సినిమా. అయితే, గతంలో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్, నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా నిర్మించారు దానయ్య. జె. భగవాన్ తో కలిసి ఆయన నిర్మించిన ఆ చిత్రమే.. `సీమ సింహం`. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `ఆర్ ఆర్ ఆర్`లాగే సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం `సీమ సింహం` కూడా సంక్రాంతి సీజన్ లోనే సందడి చేసింది. 2002 పొంగల్ కి భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. కట్ చేస్తే.. ఇప్పుడు నందమూరి కాంపౌండ్ లో తారక్ కాంబినేషన్ లో దానయ్య నిర్మించిన `ఆర్ ఆర్ ఆర్` కూడా 2022లో ముగ్గుల పండక్కే రాబోతోంది. మరి.. బాలయ్య కాంబోలో యావరేజ్ తో సరిపెట్టుకున్న దానయ్య.. తారక్ కాంబోలో సంచలన విజయం అందుకుంటాడేమో చూడాలి.