English | Telugu
సలార్ కోసం ప్రశాంత్ నీల్ స్పెషల్ కేర్!
Updated : Aug 19, 2023
జవాన్ సినిమా నుంచి కొన్ని క్లిప్స్ ని లీక్ చేసినందుకు కొందరి మీద రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇటీవల పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. ఇలాంటిదే తమ సినిమా విషయంలో రిపీట్ కాకూడదని అనుకుంటున్నారు డైరక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వం వహిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
ప్రస్తుతం సలార్ పార్ట్ ఒన్ సీజ్ ఫైర్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అన్నీ పనులను ఓ విలేజ్‌లో జరిగేలా చూసుకుంటున్నారు ప్రశాంత్ నీల్. ``సినిమాకు సంబంధించిన సన్నివేశాలను, విజువల్స్‌ని సేఫ్ గార్డ్ చేయడానికే ప్రశాంత్ నీల్ ఈ చర్యలు తీసుకున్నారు. ఎలాంటి లీకులూ ఉండకూడదని మాకు ముందే చెప్పారు. రోబస్ట్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు. కర్ణాటకలోని బస్రూర్ విలేజ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్కడే రవి బస్రూర్ స్టూడియో ఉంది. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పీడుగా జరుగుతోంది. ప్రశాంత్ ట్రైలర్ పనుల మీద ఫోకస్ చేస్తున్నారు`` అని అంటోంది కన్నడ మీడియా.
లాస్ట్ మంత్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌కి మెరుగులు దిద్దుతున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ట్రైలర్ వచ్చేస్తుంది. నేషనల్ వైడ్ ట్రైలర్ లాంచ్‌ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇండియన్ సినిమా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. లార్జర్ దేన్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది సలార్. మలయాళం సూపర్‌స్టార్ పృథ్విరాజ్ సుకుమార్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. శ్రుతిహాసన్, జగపతిబాబు, టిను ఆనంద్, శ్రియా రెడ్డి కీ రోల్స్ చేస్తున్నారు. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలో విడుదల కానుంది సలార్.