English | Telugu

తల్లితో కలిసి అమెరికా వెళ్లిన సామ్

స్టార్ హీరోయిన్ సమంత తల్లితో కలిసి అమెరికాకు వెళ్ళింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నాళ్లుగా సమంత అమెరికాకు వెళుతుందని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వార్తల్లో నిజం లేకపోలేదని ఈ వీడియోతో ఇప్పుడు క్లారిటీ వచ్చిందని మీడియా వర్గాలు అంటున్నాయి. సమంత కెరీర్ జోరు మీదున్న సమయంలో ఆమెకు అనుకోని అనారోగ్య సమస్య వచ్చింది. అదే మియో సైటిస్. ఈ కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పిన ఆమె కొన్నాళ్ల పాటు సినిమాల నుంచి రెస్ట్ తీసుకుంది. త్వరాత ఆరోగ్యం కాస్త కుదుటపడగానే ఖుషి సినిమాను కంప్లీట్ చేసింది. అలాగే రాజ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసేసింది. అంతే కాదండోయ్ .. రీసెంట్ గా ఖుషి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్ మీదనే లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఓ గ్రూపు ఇంటర్వ్యూలోనూ ఆమె పాల్గొందని సమాచారం.

ఖుషి సినిమాకు సంబంధించిన వర్క్ పూర్తవగానే సమంత తన తల్లితో కలిసి అమెరికా బయలుదేరింది. మధ్యలో కొన్నాళ్లు ఆధ్యాత్మిక భావనలో గడిపింది. ఫ్రెండ్స్ ను కలసింది. ఇప్పుడు తన ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. అమెరికాకు పలు దఫాలుగా వెళ్లే పని ఉండటంతోనే సమంత దాదాపు ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుందని సమాచారం. సమంత వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమె త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలు చేయాలని ట్వీట్స్ చేస్తున్నారు.

ఖుషి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ సమంత తను పూర్తి ఆరోగ్యంతో మళ్లీ తిరిగి వస్తానని, మళ్లీ హిట్ సినిమాలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. విజయ్ దేరవకొండ, సమంత కలిసి నటించిన ఈ ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.