English | Telugu
20కోట్లకు బుక్కయ్యిన మహేష్
Updated : Jul 22, 2013
"1-నేనొక్కడినే" చిత్రంలో నటిస్తున్న మహేష్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. యుటివి సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో నటించడానికి 20కోట్లు పారితోషకం కావాలని మహేష్ అడిగాడట. దీనికి యుటివి సంస్థ కూడా 20 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారంట. గతంలో వీరి కాంబినేషన్ లో "అతిధి" చిత్రం వచ్చింది. కానీ ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
మహేష్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1-నేనొక్కడినే" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న "ఆగడు" చిత్రంలో మహేష్ నటించనున్నాడు. ఈ చిత్రాల తర్వాత యుటివి వారితో మహేష్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.