English | Telugu

ఇంకా దెబ్బలు పడితే వస్తా...!

ఉదయభాను యాంకరింగ్ తో పాటుగా నటిగా, డాన్సర్ గా అందరికి తెలిసిందే. అయితే ఈ అమ్మడు ఇటీవలే ఓ పాట రాసి, పాడారు కూడా. అయితే ఆ పాటలో తనలో ఉన్న ఆవేశాన్ని తెలిపింది. అందులో "గద్దెకోసం గాడిది కొడుకులు..." అనే పదాలు వాడి.. సినిమా ఇండస్ట్రీ తో పాటు, రాజకీయ రంగానికి చెందిన వారికి కూడా చర్చనీయంశంగా మారింది.

ఉదయభాను త్వరలోనే బిజేపి పార్టీలో చేరనున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను ఆమె ఖండించింది. అసలు ఇప్పుడే కాదు..తనకెప్పుడు రాజకీయాలు సూట్ కాబోవని చెప్పింది. అయితే ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రానని చెబుతూనే... "ఒకవేళ భవిష్యత్తులో తప్పనిసరి అయితే... ఇంతకన్నా పెద్ద దెబ్బలు తగిలితే... అప్పుడు రాజకీయాల్లోకి వస్తానేమో చెప్పలేం" అంటూ తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పింది.