English | Telugu
దర్శకుడిగా మారనున్న కామెడీ హీరో
Updated : Jul 22, 2013
కామెడి నటుడిగా తన సినీ కెరీర్ ను కొనసాగిస్తున్న అవసరాల శ్రీనివాస్ త్వరలోనే దర్శకుడిగా మారనున్నాడు. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించనున్నారని సమాచారం. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు ఉండబోతున్నారని.. అందులో ఒకరిగా హీరో నానిని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం శ్రీనివాస్ "అంతకు ముందు ఆ తరువాత","చందమామ లో అమృతం" చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.