English | Telugu
సూపర్ ఛాన్స్ సొంతం చేసుకున్న తమన్నా !!
Updated : Jun 17, 2013
అసలే టాలీవుడ్ లో టాప్5 హీరోయిన్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మహేష్‌బాబు సరసన నటించే అవకాశం ఏరికోరి ఆమెను వరించడంతో... తమన్నా కి క్రేజ్ మరీ పెరిగిపోయింది. ఇదంతా కామనే కదా అని అనుకోకండి.
నిజానికి మహేష్_సుకుమార్ కాంబినేషన్‌లోతెరకెక్కుతున్న "ఒన్ నేనొక్కడినే" చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకోవాలనుకున్నారు. కానీ.. తమన్నా డేట్స్ ఖాళీలేనందున, ఆ అవకాశం కాస్త కృతిసనమ్ కి దక్కింది. అయితే తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ నటించనున్న "ఆగడు" చిత్రంలో నాయికగా తమన్నా ఎంపికవ్వడంతో ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారింది. "దూకుడు" వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత శ్రీనువైట్ల_మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం విశేషం. మరి ఈ చిత్రంతో తమన్నా పొజిషన్ టాలీవుడ్‌లో నెం.1 స్థానానికి చేరుతుందో లేదో చూడాలి.