English | Telugu

మహేష్ అభిమాని అనుమానం నిజమైంది !!

ఓ వారం రోజుల క్రితం మహేష్‌బాబు ట్విట్టర్ ఎకౌంట్‌ను ఎవరో అభిమాని హ్యాక్ చేసి.. సిని"మా" అవార్డ్స్‌లో మహేష్ ఎంపిక కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ అంతటా చర్చనీయాంశమైంది. అది గాలి వార్త అని అందరూ దాదాపుగా ఆ విషయాన్ని మరిచిపోయే స్టేజ్‌కి వచ్చేసారు. అయితే.. మొన్న జరిగిన "మా" అవార్డ్స్ వేడుక ఆ ఆరోపణలను నిజం అని అనిపించేలా చేసింది.

మొత్తం అవార్డుల్లో సగానికిపైగా చిరంజీవి, నాగార్జున స్వచ్చందంగా పంచుకున్నారు. ముఖ్యంగా హిందీ "దబాంగ్"కు రీమేక్‌గా రూపొందిన "గబ్బర్‌సింగ్" చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు, ఆ చిత్రంలో నటించినందుకుగాను పవన్‌కళ్యాణ్‌ను ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపిక చేయడం గమనార్హం.

అలాగే.. "షిరిడి సాయి" చిత్రం కూడా బెస్ట్ హీరో (జ్యూరీ), బెస్ట్ ఫిలిం (జ్యూరి) అవార్డులు అందుకోవడం.. అన్ని మేమే పంచుకుంటే బాగుందడనే ఉద్దేశంతో కొన్ని అవార్డులు రాజమౌళి "ఈగ"తో పాటు మరి కొందరికి కూడా పంచిపెట్టడం అందర్నీ ఆశ్యచ్యపరుస్తోంది.

మరి.. మహేష్‌బాబు అభిమాని సరదాకి చేసిన ట్వీట్ నిజమవ్వడంతో.. సిని"మా" అవార్డ్స్ వేడుక హాస్యాస్పదమైంది!