English | Telugu
"హలో బ్రదర్"లో తమన్నా, హన్సిక !!
Updated : Jun 17, 2013
నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య జంటగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "హలో బ్రదర్". ఈ చిత్రాన్ని నాగచైతన్య రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డి. శివప్రసాద్ రెడ్డ్డి నిర్మించనున్నారు.
అయితే నాగార్జున పాత్రలో నాగచైతన్య ద్విపాత్రాభినయం చేస్తుండగా.. రమ్యకృష్ణ పాత్రలో తమన్నా, సౌందర్య పాత్రలో హన్సిక నటించనున్నారు. జూలై మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. హిట్ పెయిర్ గా పేరొందిన నాగ చైతన్య-తమన్నా కలిసి నటించడం ఇది మూడో చిత్రం, కానీ హన్సిక-చైతన్య లది ఫ్రెష్ కలయిక. మరీ విరిద్దరిది హిట్ పెయిర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.