English | Telugu
చిరంజీవిగారిని విమర్శిస్తుంటే బాధగా ఉంది!
Updated : Aug 19, 2023
తొలి చిత్రం RX 100తో బ్లాక్ బస్టర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. ఆ తర్వాత ఆయన హీరోగా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సాలిడ్ హిట్ మాత్రం వచ్చి చాలా రోజులే అయ్యింది. అయితే ఆ కొరత ‘బెదురు లంక 2012’ చిత్రంతో తీరుతుందని అంటున్నారు కార్తికేయ. ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్‌గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా స్పీడుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘‘మెగాస్టార్ చిరంజీవిగారిని విమర్శిస్తుంటే చాలా బాధగా ఉంది. సినిమా నచ్చొచ్చు.. లేదా నచ్చకపోవచ్చు. దాని గురించి తమ అభిప్రాయాలను చెప్పొచ్చు. కానీ సినిమాను బేస్ చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయటం సరికాదు. అయితే వీటిని ఆయన పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆయన తన కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. ఇలాంటి విమర్శలు చేయటం చాలా చిన్న విషయం. వీటిని పట్టించుకోకుండా తన తదుపరి చిత్రంపై ఆయన ఫోకస్ చేస్తారు’’ అని పేర్కొన్నారు కార్తికేయ. ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ RX 100 సినిమాలో హీరో పేరు శివ.. బెదురులంక సినిమాలోనూ నా పేరు శివ.. ఇది యాదృచ్చికంగానే జరిగిందన్నారు మన కథానాయకుడు.
బెదురులంక 2019 సినిమాను క్లాక్స్ డైరెక్ట్ చేశారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించారు. 2019లో యుగాంతం జరుగుతుందనే వార్తలు వచ్చాయి. దాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను డైరెక్ట్ చేశారు.