English | Telugu

కండ‌లు పెంచనున్న ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క్రేజీ సినిమాల‌ను లైన‌ప్ చేసుకుంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. RRR వంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత తార‌క్ న‌టిస్తోన్న చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. త‌న‌దైన స్టైల్లోకొర‌టాల అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ చ‌క‌చ‌కా జ‌రిగిపోతుంది. సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామ‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించేశారు. అందులో భాగంగా డైరెక్ట‌ర్ మూవీని కంప్లీట్ చేసే ప‌నిలో ఉన్నారు. న‌వంబ‌ర్, డిసెంబ‌ర్‌ నాటికంతా దేవర చిత్రానికి సంబంధించి త‌న పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను ఎన్టీఆర్ కంప్లీట్ చేయాల‌ని అనుకుంటున్నారు.

ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ మూవీగా వార్ 2లో న‌టించ‌బోతున్నారు. హృతిక్ రోష‌న్ హీరోగా అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్క‌నుంది. ఇందులో ఎన్టీఆర్ నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది యాక్ష‌న్ ప్ర‌ధానంగా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా సిక్స్ ప్యాక్ లుక్‌తో మెప్పించ‌బోతున్నార‌ట ఎన్టీఆర్‌. జ‌న‌వ‌రి నుంచి వార్ 2 కోసం అమెరికా వెళ్లి అక్క‌డి నిపుణుల స‌మ‌క్షంలో త‌న లుక్ విష‌యంలో తార‌క్ స్పెష‌ల్ కేర్ తీసుకోబోతున్నార‌ని స‌మాచారం.

వార్ 2 త‌ర్వాత ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో సినిమా రానుంది. హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మించ‌నుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఆయ‌న సినిమాల కోసం ఎందుకు చూస్తున్నారు. ఈ వ‌రుసలో ముందుగా దేవ‌ర సినిమానే మెప్పించ‌నుంది.

Is Jr NTR Playing Negative Role In War 2, ntr six pack photos, jr ntr character in war 2 have negative shades, Hrithik Roshan, Hrithik Roshan War 2, NTR Villain, Jr NTR to play villain in Hrithik Roshan starrer War 2