English | Telugu
Indian 3: ఇండియన్ పార్ట్ 3 రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Updated : Nov 4, 2023
ఇండియన్ సినిమా పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడో తెలుసా అని అడగుతారు. కానీ, ఇదేంటి? ఇండియన్3 గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇండియన్2 కన్నా, ఇండియన్ 3 మీదే ఫోకస్ ఎక్కువగా కనిపిస్తోంది జనాల్లో. కమల్‌హాసన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు ఇండియన్2 ఇంట్రడక్షన్ టీజర్‌ని. టీజర్ చూసి కొంతమంది సూపర్బ్ అని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ఆ.. ఏముంది అందులో అంటూ పెదవి విరిచారు. ఆ డిస్కషన్ అంతటితో కంప్లీట్ అయింది. ఇప్పుడు మాత్రం ఇండియన్3 గురించి టాపిక్ మొదలైంది.
ఇండియన్ 3 యాక్చువల్‌గా ప్రీ ప్లాన్డ్ వెర్షన్ కాదట. ఇండియన్2 సినిమా రన్ టైమ్ ఎక్కువగా వచ్చిందట. అందుకే రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని ఫిక్సవుతున్నారట మేకర్స్. శంకర్ డైరక్షన్ చేసిన మూవీ ఇది. కమల్‌హాసన్ భారతీయుడుగా కనిపిస్తారు.
ఇండియన్2 సినిమా ఇప్పటికి రన్ టైమ్ ఐదున్నర గంటలు దాటుతోందట. అందుకే పార్టు 2లో ఫస్ట్ పార్టుని 2024 ఏప్రిల్ 12న విడుదల చేయాలనుకుంటున్నారు. పార్టు 2లో సెకండ్ పార్టును అంటే... త్రీక్వెల్‌ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా మేకర్స్ దీని గురించి నోరు విప్పలేదు. రజనీకాంత్, మోహన్‌లాల్, ఎస్ ఎస్ రాజమౌళి, కిచ్చా సుదీప్, ఆమిర్‌ఖాన్, రామ్‌చరణ్‌లాంటి ప్రముఖులు రిలీజ్ చేసిన ఇంట్రో వీడియో మాత్రం ఇన్‌స్టంట్‌గా వైరల్ అయింది. సొసైటీలో లంచగొండితనం పెరిగిపోతోంది అని చెబుతూ బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ పెట్టారు శంకర్. ఐ యామ్ బ్యాక్ అంటూ కమల్ చెప్పిన తీరు కూడా ఆకట్టుకుంటోంది. కె.సుభాస్కరన్ తెరకెక్కిస్తున్న మూవీ ఇండియన్2. ఉదయనిధి స్టాలిన్ కూడా ఓ నిర్మాత. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు, రవివర్మన్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేస్తున్నారు.