English | Telugu
Director Puri Jagannath Health Condition: పూరి కొత్త లుక్.. అతని ఆరోగ్యంపై ఆందోళన!
Updated : Nov 4, 2023
టాలీవుడ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్‌ది ఒక విభిన్నమైన శైలి. రొటీన్ సినిమాలకు భిన్నంగా తన సినిమాల్లో కొత్తదనం ఉండాలని కోరుకుంటారు. ఆ పద్ధతిలోనే టాలీవుడ్‌లోని టాప్ హీరోలతో సినిమాలు తీసి సూపర్‌హిట్ కొట్టారు. ఫ్లాప్ అయిన సినిమాలు కూడా టేకింగ్ పరంగా బాగుంటాయి. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా డైరెక్టర్‌గా తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. హీరోలకు ఫ్యాన్స్ ఉన్నట్టే.. పూరికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల విజయ్ దేవరకొండతో చేసిన ‘లైగర్’ పూరిని తీవ్రంగా నిరాశపరచింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి, పూరి మధ్య గొడవలు జరిగాయని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రూమర్సేనని తెలిసింది. ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ బిజీలో ఉన్నాడు పూరి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’కి డబుల్ ఇంపాక్ట్ వచ్చేలా చిత్రీకరిస్తున్నాడు పూరి.
ఇదిలా ఉంటే.. పూరి ఫోటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఛార్మి. ఆ ఫొటోలో పూరీ లుక్ చాలా వెరైటీగా, గుర్తుపట్టలేని విధంగా ఉంది. అసలు పూరీకి ఏమైంది? ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పూరి జగన్నాథ్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.