English | Telugu

varun lavanya expensive wedding: బాప్‌రే.. వరుణ్‌-లావణ్యల పెళ్లికి అంత ఖర్చు చేశారా?

మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. మూడు ముళ్ళ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇటలీలో మెగా కుటుంబ సభ్యులు, లావణ్య కుటుంబ సభ్యులు, ఇంకా సన్నిహిత మిత్రుల సమక్షంలో జరిగింది. వీరిద్దరూ ఇటలీలోనే తమ పెళ్ళి జరగాలని కోరుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. ‘మిస్టర్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలోనే వరుణ్‌, లావణ్య కలుసుకున్నారు. మొదటి పరిచయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం ఇటలీలోనే జరిగింది. తమ ప్రేమ చిగురించింది కాబట్టి పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. అందుకే ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేసింది మెగా ఫ్యామిలీ.

ఇటలీలో పెళ్లి చేశారంటే ఖర్చు కూడా బాగా అయి వుంటుందని అందరూ లెక్కలు వేస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాక్‌టైల్‌ పార్టీ, హల్దీ పార్టీ, మెహందీ, పెళ్లి... ఇలా దశలవారీగా జరిగిన ఈ వేడుకను అందరూ ఆశ్చర్యపోయే రేంజ్‌లో నిర్వహించింది మెగా ఫ్యామిలీ.

ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అతిథులకు పది కాలాలపాటు గుర్తుండిపోవాలని ఖర్చుకు వెనకాడకుండా ఎంతో గ్రాండ్‌గా ఈ వేడుకను జరిపించారు. ఈ పెళ్లికి ఎంత ఖర్చు అయిందనేది అదికారికంగా ఎక్కడా ప్రకటించకపోయినా.. సోషల్‌ మీడియాలో నెటిజన్లు వేసిన లెక్కల ప్రకారం రూ.17 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. పెళ్లికే ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తే నవంబర్‌ 5న హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌ ఇంకెంత గ్రాండ్‌గా నిర్వహిస్తారో.. దానికెంత ఖర్చు చేస్తారోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.