English | Telugu

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ఐదు సంక్రాంతి సినిమాలు.. మీ ఫస్ట్ ఓటు ఎవరకి 


-థియేటర్స్ లో ఎంటర్ టైన్ చేసాయి
-ఆ విషయంలో ఐదు చిత్రాల స్పెషల్ ఇదే
-మీ ఇంట్లోకే వస్తున్నాయి.
-అసలు మిస్ అవ్వకండి

మొన్న జరిగిన సంక్రాంతి వేడుకలకి మరింత కాంతుల్ని వెదజల్లుతు 'ది రాజాసాబ్(The Raja Saab),మన శంకర వరప్రసాద్ గారు(Mana shankara varaprasad Garu),భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku vignapthi),అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju),నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari)సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ల్యాండ్ అవ్వడమే కాదు సంక్రాంతి ప్రేక్షకులకి ఎంటర్ టైన్ ఇవ్వడంలో తగ్గేదేలే అనే విధంగా తమ శక్తీ కొలది ప్రయత్నించాయి. విజయం సాధించిన రీతిలో తేడాలు ఉండవచ్చేమో గాని ఎంటర్ టైన్ మెంట్ మాత్రం పక్కా. ఇప్పుడు ఈ ఐదు చిత్రాలు తన ఫోకస్ ని ఓటిటి వైపు మళ్లించాయి. మరి వాటికి సంబంధించిన డేట్, స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో చూద్దాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతీ, విశ్వప్రసాద్ ల రాజా సాబ్ ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ పార్టనర్. డేట్ విషయం అధికారకంగా కూడా కన్ఫార్మ్ అయ్యింది. మన శంకర వరప్రసాద్ గారు ఫిబ్రవరి 11 నుంచి జీ 5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్టుగా తెలుస్తుంది. జీ 5 నుంచి ఇంకా అధికార ప్రకటన రాకపోయినా పదకొండు మాత్రం పక్కా లాండింగ్ అంటున్నారు. చిరంజీవి మానియా కి వెంకటేష్, అనిల్ రావిపూడి, నయనతార ల మ్యాజిక్ తోడవ్వడంతో స్టిల్ 350 కోట్ల రూపాయిల గ్రాస్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. మరి 11 న స్ట్రీమింగ్ ఉంటుందో లేదో చూడాలి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ నెల 13 నుంచి జీ 5 నుంచే స్ట్రీమింగ్ కి రెడీ అంటుంది. జీ 5 నుంచి అధికార ప్రకటన కూడా వచ్చేసింది.

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి,నాగ వంశీ ల అనగనగ ఒక రాజు ఈ నెల 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అధికార ప్రకటన రానున్నట్టుగా తెలుస్తుంది. శర్వానంద్, సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ల నారీ నారీ నడుమ మురారి రేపటినుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Also read: ధురంధర్ 2 టీజర్ హైలెట్స్ ఇవే.. ఆ గెటప్ గమనించారా


సంక్రాంతికి మాత్రం పండగ హడావిడి వేళ ఏ సినిమాకి ముందుగా వెళ్లాలో తేల్చుకోలేక టెన్షన్ పెట్టిన సంక్రాంతి సినిమాలు ఇప్పుడు నింపాదిగా మీ ఇంట్లోకి వస్తున్నాయి. తులాభారం వెయ్యకుండా చూసి ఎంజాయ్ చెయ్యండి. ఎంటర్ టైన్ మెంట్ మాత్రం పక్కా.


పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.