English | Telugu
పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం
Updated : Feb 3, 2026
-మరో మారు బయటపడిన రజినీ కాంత్ మంచి తనం
-సినిమా కాదు రియల్
-45 తులాలు అంటే మాటలా!
చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఇద్దరి మధ్య వచ్చే ఆర్ ఆర్, భావోద్వేగాలకి అయితే సినిమాలోని క్యారెక్టర్స్ కంటే ప్రేక్షకుడు ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ ఇప్పుడు ఆన్ ది స్క్రీన్ కాకుండా ఆఫ్ ది స్క్రీన్ అలాంటి సంఘటన రియల్ గా జరిగింది. ఈ విషయం మొత్తంపై సూపర్ స్టార్ రజినీ కాంత్(Rajini Kanth)స్వయంగా రంగంలోకి దిగడం విశేషం.
చెన్నై నగర పాలక సంస్థలో పద్మ అనే ఆవిడ పారిశుధ్య కార్మికురాలుగా పని చేస్తుంది. ఇటీవల ఆమెకి రోడ్ పై 45 తులాల బంగారం దొరికింది. సదరు బంగారం పై ఎలాంటి మోజుని పెంచుకోకుండా పోలీసులకి అప్పగించింది.ఆ తర్వాత పోలీసులు బంగారాన్ని యజమానికి అప్పగించారు. సదరు పారిశుధ్య కార్మికురాలి నిజాయితీకి మెచ్చుకున్న రజినీ కాంత్ ఆమెని తన ఇంటికి పిలిపించుకొని సన్మానించడమే కాకుండా ఆమెకి ఒక బంగారపు గొలుసుని బహుమతిగా ఇచ్చాడు.
Also read: ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ఐదు సంక్రాంతి సినిమాలు.. మీ ఫస్ట్ ఓటు ఎవరకి
భారత తపాలా శాఖ పద్మ ఫొటోతో కూడిన స్టాంప్ రిలీజ్ చెయ్యడంతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్ ద్వారా 15 లక్షల ప్రమాద భీమా పాలసి, తమిళనాడు ప్రభుత్వం లక్ష బహుమతిని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.