English | Telugu

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 


విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ పాటలకి మరింత ప్రాముఖ్యతని పెంచింది. చిత్ర బృందం రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే ప్రమోషన్స్ టూర్ లో చక్కటి స్పందన తెచ్చుకుంది. తిరుపతిలోని ఒక కళాశాలలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.

సీరియల్స్ అలాగే బిగ్ బాస్ ద్వారా ప్రతి ఇంట్లో ఒకరిగా అందరికీ పరిచయమైన అమర్దీప్ చౌదరి(Amardeep Chaudhary)మాస్ మహారాజ్ రవితేజ(Raviteja)అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్ చూసిన మాస్ మహారాజ్ రవితేజ గారు స్పందిస్తూ... "అమర్దీప్, సుమతీ శతకం చిత్ర టీజర్, ట్రైలర్ ఇంకా ఇతర కంటెంట్ చూడడం జరిగింది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

కాలేజీలలో ప్రమోషన్లు చేస్తున్న సమయంలో హుక్ స్టెప్స్ విద్యార్థులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా టీజర్ ఇంకా ట్రైలర్ కు ప్రమోషన్స్ సమయంలో యువత నుండి ఆంధ్ర, తెలంగాణలో మంచి స్పందన లభించింది. చిత్ర టైటిల్ కూడా ప్రేక్షకులలో ఎంతగానో చొచ్చుకు పోయింది. సాధారణంగా జీరో కట్స్ తో సెన్సార్ కావడం అనేది చాలా అరుదైన విషయం, అటువంటిది ఈ చిత్రానికి జీరో కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ తో పాటు సెన్సార్ బోర్డు నుండి ప్రశంసలు రావడం మరొక ప్రత్యేకమైన విషయం. చాలా రోజులు తరువాత ఫీల్ గుడ్ సినిమాను చూస్తున్నామని సెన్సార్ వారు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలలో మైత్రి మూవీ మేకర్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో వైబ్రంట్ సినిమాస్, అమెరికాలోని డల్లాస్ లో రవి కొల్లిపార, జై పాకాల విడుదల చేయనున్నారు.

టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్ తదితరులు ఇతర క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్: ఎస్ హలేష్, ఎడిటర్: నహిద్ మహమ్మద్, పిఆర్ఓ: మధు విఆర్, డిజిటల్ మార్కెటింగ్ : హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం


పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.