English | Telugu

ఎందుకు మార్చారో ఎవరు చెప్తారు.. టీజర్ రాగానే మీకే తెలుస్తుందిగా


-పార్ట్ 1 అప్పుడు ఏం చెప్పారు
-పార్ట్ 2 కి ఏం చెప్తున్నారు
-మార్చి 19 న సంచలనం పక్కానా!

ఈ రోజు ధురంధర్ పార్ట్ 2 కి సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతుంది. దీంతో ఆల్ ఓవర్ ఇండియన్స్ మొత్తం సినీ ప్రేమికులుగా చార్జ్ తీసుకొని సీక్వెల్ కి సంబంధించిన కథ, కథనాలపై స్టిల్ తమ పనులు చూసుకుంటూనే చర్చించుకుంటూ ఉండటం ఖాయం. ఈ చర్చ కి పొలిటికల్ లీడర్స్ అతీతులేమి కాదు. మొదటి భాగంలో మన దేశాన్ని ఉగ్రవాద దాడులతో నాశనం చేయాలనీ చూస్తున్నరెహ్మాన్ డెకాయిట్ ని హంజా అలీ మజారి గా ఉన్న రా ఏజెంట్ జస్కి రాత్ సింగ్ చంపేస్తాడు. కానీ ఏంజెల్ ఆఫ్ డెత్ గా పిలవబడే మేజర్ ఇక్బాల్ తో పాటు ఇంకొంత మంది ఉగ్రవాదులు మొదటి భాగంలో బతికే ఉన్నారు. ధురంధర్ లో చూపిస్తున్నాయని ఒరిజినల్ క్యారెక్టర్స్ నే కాబట్టి సీక్వెల్ లో కొత్త క్యారక్టర్ లు ఏమైనా ఎంట్రీ ఇవ్వబోతున్నాయా అని చర్చించుకోవడం ఖాయం. ఇప్పుడు ఆ చర్చ ఇంకో దానిపైకి ఫోకస్ అయ్యేలా ధురంధర్ 2 టీజర్ కి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ కలిపించింది. ఫోకస్ ని భగ్నం చేసిన సదరు పోస్టర్ లో ఏముందో చూద్దాం.

పార్ట్ 2 టీజర్ కి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ లో ఓటీటీ హక్కులు జియో హాట్‌స్టార్ ఉన్నట్టుగా చెప్పారు.అంటే సీక్వెల్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. కానీ ఫస్ట్ పార్ట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో సీక్వెల్ ఓటీటీ పార్ట్‌నర్‌ని ఎందుకు ఎందుకు మార్చారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.నిజానికి ఇదంతా పెద్ద చర్చ చెయ్యాల్సిన విషయం కాదు. కానీ ఇది ధురంధర్. తొలి భాగం షూటింగ్ జరిగేటప్పుడే రెండవ భాగం కూడా మాగ్జిమమ్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. మరి ఆ టైంలోనే రెండు బాగాలకి సంబంధించిన డీల్ ని ఓటిటి సంస్థలు పూర్తి చేసుకుంటాయి. అంటే సినిమాపై నమ్మకంతో భారీ ఆఫర్స్ కి పోటీ పడి మరి దక్కించుకుంటాయి.

Also read:సాయిపల్లవి vs శ్రీలీల.. ఈర్ష్య అసూయకి గేట్లు తెరుచుకుంటాయా!

అందుకే మొదటి భాగం నెట్ ఫ్లిక్స్, రెండవ భాగం జియో హాట్ స్టార్ దక్కించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి అసలు మర్మమేంటో, ఆ మర్మం వెనక భారీ ఆఫర్ దాగి ఉందో లేక ఫ్యూచర్ లో తమ సినిమాలకి ఓటిటి విషయంలో బిజినెస్ పరంగా అండదండలు ఉండాలని సమన్యాయం కింద జరుగుతున్న క్యాజువల్ ట్రీట్ మెంట్ నో మేకర్స్ కే తెలియాలి. పార్ట్ 2 మార్చి 19 న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.



బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.