English | Telugu

సాయిపల్లవి vs శ్రీలీల.. ఈర్ష్య, అసూయకి గేట్లు తెరుచుకుంటాయా!


-సాయి పల్లవి, శ్రీలీల లో ఎవరు బెస్ట్ డాన్సర్
-ఆ మూవీలో ఏం జరగబోతుంది!
-ఎవరు డాన్స్ లో గెలవబోతున్నారు

సాయిపల్లవి(Sai Pallavi),శ్రీలీల(Sreeleela)..ఈ ఇద్దరికి ఉన్న కామన్ పాయింట్ చెప్పమంటే ఎవరైనా కాసేపు తమ మెదళ్ళకి పని చెప్పుకోవడం ఖాయం. కానీ ఆ ఇద్దరి అభిమానులు, మూవీ లవర్స్ మాత్రం ఒక్క నిమిషం ఆలోచించకండా ఆ ఇద్దరికి ఉన్న కామన్ పాయింట్ ని ప్రశ్న కంప్లీట్ కాకుండానే చెప్పేస్తారు. ఆ ఇద్దరు డాన్స్ లో కింగ్స్ అని. అంతలా తమ డాన్స్ తో పూనకాలు తెప్పించగలరు. కొంత మంది హీరోల ఫ్యాన్స్ హార్ట్స్ హర్ట్ అయిన పర్లేదు కానీ హీరోలని మించి డాన్స్ చెయ్యగల సినీ మహారాణులు. ఇప్పుడు ఈ ఇద్దరు తమ అభిమానులు థియేటర్స్ లో కొట్టుకునేలా చేస్తారేమో అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. మరి ఆ న్యూస్ వెనక ఉన్న కహాని ఏంటో చూద్దాం.

స్టార్ హీరో ధనుష్(Dhanush)తన 55 వ చిత్రాన్నిఇటీవలే అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి(Rajkumar Periasamy)దర్శకుడు కావడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కి ప్లేస్ ఉంది. ఆల్రెడీ శ్రీలీల ని అధికారకంగా అనౌన్స్ చేసారు. ఇప్పుడు ఇంకో హీరోయిన్ గా సాయిపల్లవి కి మేకర్స్ వెల్ కమ్ చెప్తున్నారు. సౌందర్యానికి, బలానికి సాయి పల్లవి ప్రతీక అనే బ్యూటిఫుల్ వర్డ్ తో అధికార ప్రకటన కూడా వచ్చేసింది.ఇప్పుడు ఈ ఇద్దరు భామలు సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానుల్లో వైరల్ గా మారింది.

ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్లేస్ లో పోటీ వాతావరణం అనేది కామన్. కానీ ఇద్దరు డాన్సింగ్ క్వీన్స్ మధ్య వచ్చే పోటీ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా పక్కా మాస్ యాక్షన్ చిత్రంగా రూపొందుతుంది. దీంతో మాస్ సాంగ్స్ ఒక రేంజ్ లో ఉండటం ఖాయం. ఒక వేళ డాన్స్ లకి స్కోప్ ఉండదని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే శ్రీలీల,సాయి పల్లవి లాంటి డాన్సర్స్ ని పెట్టుకొని మేకర్స్ కంపల్సరీ మాస్ బీట్ తో కూడిన సాంగ్స్ ఫిక్స్ చెయ్యడం పక్కా. తమిళ తంబీ సినీ ఆచారం కూడా అదే. మారి మూవీలో 'రౌడీ బేబీ' సాంగ్ కి ధనుష్, సాయి పల్లవి చేసిన డాన్స్ హుంగామ తెలిసిందే.

Also read:బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ

ఆ సాంగ్ ని మర్చిపోయేలా తన పెర్ఫార్మ్ ఉండాలని శ్రీలీల అనుకోవడం కామన్. సాయి పల్లవి కండిషన్ కూడా సేమ్ ఉంటుంది. మరి ఈ లెక్కన ఆ ఇద్దరు డాన్స్ లో ఒకరికొకరు బీట్ చెయ్యాలని చూడటం ఖాయం. మూవీ లవర్స్ కళ్ళకి కనువిందు.. అభిమానుల కుళ్లుకి అంకురార్పణ తప్పదనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. వండర్ బార్ ఫిలిమ్స్ పై ధనుష్ నే నిర్మిస్తున్నాడు.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.