English | Telugu

'జైలర్-2'లో షారుఖ్ రోల్ ఇదే.. బాలయ్య చేసి ఉంటే..?

'జైలర్-2'లో గెస్ట్ రోల్ లో షారుఖ్ ఖాన్!
రజినీకాంత్ ఫ్రెండ్ గా బాలీవుడ్ బాద్‌షా!
బాలకృష్ణతో అనుకున్న సీక్వెన్స్ నే ఇలా మార్చారా?

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్ లో వచ్చిన 'జైలర్' మూవీ, వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'జైలర్-2' (Jailer 2) రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తుండటం విశేషం. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ రివీల్ అయ్యాయి.

'జైలర్-2'లో రజినీకాంత్ ఫ్రెండ్ గా షారుఖ్ కనిపించనున్నాడని తెలుస్తోంది. క్లిష్టమైన పరిస్థితిలో రజినీ మనుషులను రక్షించేందుకు షారుఖ్ ఎంట్రీ ఇస్తాడట. ఈ సీక్వెన్స్ ను నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేసినట్లు సమాచారం.

నిజానికి 'జైలర్'లో గెస్ట్ రోల్స్ కూడా ఇదే తరహాలో ఉంటాయి. మొదటి భాగంలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ అతిథి పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శివ రాజ్‌కుమార్ రోల్ కి థియేటర్లలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రజినీ ఫ్యామిలీని విలన్ గ్యాంగ్ నుంచి రక్షించడానికి శివ రాజ్‌కుమార్ వచ్చే సీన్ అదిరిపోయింది.

'జైలర్-2'లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గెస్ట్ రోల్ చేస్తారని మొదట్లో వార్తలొచ్చాయి. కానీ ఎందుకనో ఆయన ఆసక్తి చూపలేదు. బాలయ్య గెస్ట్ రోల్ చేస్తే.. శివన్న రోల్ ని మించిన రెస్పాన్స్ రావడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. కానీ బాలయ్య నో చెప్పడంతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది.

అయితే బాలకృష్ణతో అనుకున్న సీక్వెన్స్ నే షారుఖ్ ఖాన్ కోసం సరికొత్తగా మలిచినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. దాదాపు పది నిమిషాల పాటు తెరపై షారుఖ్ సందడి చేయనున్నాడని వినికిడి. మరి ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందనేది చూడాలి.

Also Read: విజయ్, రష్మిక పెళ్లి.. అది ఫేక్ న్యూస్!

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం