Home

»

Latest News

సమంత రెండో పెళ్ళి.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

Dec 01, 2025

 

నాగ చైతన్యతో విడాకుల తరువాత డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉన్నట్లు, వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా రాజ్-సమంత పెళ్ళి చేసుకున్నారు. నేడు(డిసెంబర్ 1న) కోయంబత్తూర్ లోని 'ఈశా యోగా సెంటర్'లో వీరి వివాహం జరిగింది. (Samantha Ruth Prabhu)

 

సమంత రెండో పెళ్ళి చేసుకున్న వేళ.. ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

 

"ఒక ఇంటిని పాడు చేసి, నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావు – బాధగా ఉంది 
స్వయం శక్తి, చదువుకున్న, అహంకారంతో నిండిన మహిళ – పెయిడ్ పీఆర్ క్యాంపెయిన్‌లతో కీర్తించబడింది
బలహీనమైన, నిస్సహాయమైన పురుషులను డబ్బు కొనగలదు" అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.

 

సమంత, రాజ్ లను ఉద్దేశించే పూనమ్ ఈ ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

 

?s=20

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com