English | Telugu
వీరయ్యకు బాబీ దొరికాడు!
Updated : Jan 1, 2023
వీరయ్య అంటే ఇప్పుడు అందరికీ టక్కున వాల్తేరు వీరయ్య గా అర్ధమైపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానున్న ఈ మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. రోజురోజుకు సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలవుతున్న అప్డేట్స్ గాని సాంగ్స్ గాని నెక్స్ట్ లెవల్ అన్నట్టుగా ఉన్నాయి. జనాల చేత పాటలు అయితే చిందులు వేయిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటలకు చిందులు వేస్తూ మహా ఆనంద పడిపోతున్నారు. ఈ చిత్రంలోని పాటలకు మామూలు సెలబ్రిటీలు, సామాన్యులే ఇంతగా ఉరమాస్ స్టెప్పులేస్తుంటే డాన్సింగ్ కింగ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ పాటల స్టెప్పులను ఏ రేంజ్ లో వేసి ఉంటాడో అని అందరిలోనూ ఉత్కంఠత ఆసక్తి పెరిగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు వెండితెరపై మెగాస్టార్ చిందులను చూద్దామా అని అందరూ కళ్ళు కాయలు ఎదురుచూస్తున్నారు. దానికి తోడు చిరంజీవి చెబుతున్న సినిమా హైలెట్స్, బాబి ఇస్తున్న లీకులు ఒక రేంజ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. దాంతో ఈ సినిమాకి బాగా హైప్ పెరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిత్రంలోని పాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ఈ సినిమాలో రవితేజకు కూడా బాగానే నిడివి ఉంటుంది. వీరి కలయికలో పలు మాస్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయట. మెయిన్ విలన్స్ గా ఇందులో ఇద్దరు నటించబోతున్నారట. ఒకరు సీనియర్ విలక్షణనటుడు ప్రకాష్ రాజ్ కాగా రెండోది తమిళ ప్రముఖ నటుడు బాబి సింహ అని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ఇందులో ఇంతవరకు కనిపించని విధంగా అద్భుతమైన పాత్రలో కనిపించనున్నాడట. మరోవైపు తమిళ నటుడు బాబీసింహా సినిమాలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ తో మెగాస్టార్ తో పోటీ పడనున్నట్టు సమాచారం. వాస్తవానికి బాబీ సింహాది హైదరాబాద్‌లోని మౌలాలి. పుట్టింది హైదరాబాద్ లో అయినా స్వస్థం బందర్. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించినా తమిళంలోనే ఈయనకు గుర్తింపు ఎక్కువ. తెలుగులో నాలుగైదు చిత్రాలలో నటించినా అందులో డిస్కోరాజా మాత్రమే పెద్ద చిత్రం. ఇక వాల్తేరు వీరయ్యలో ఏకంగా ఇటు మెగాస్టార్ చిరంజీవిని అటు మాస్ మహారాజా రవితేజ లను దీటుగా ఎదుర్కోవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. దానికి బాబీ సింహ వందకి వెయ్యి శాతం న్యాయం చేశాడని అంటున్నారు. వైజాగ్ లో నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయట. బాబీ పాత్ర సినిమాలో ఓ రేంజ్ లో ఉంటుందని ఇక మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ రెండు పాత్రలు కూడా ఒక యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటారని అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రం మెగా అభిమానులకే కాక మాస్ మహారాజా ఫ్యాన్స్ కి కూడా పూనకాలు తెప్పిస్తుందంటే అతిశయోక్తి లేదు.