English | Telugu
మిస్ ఇండియాతో సింహ సరసాలా?
Updated : Jun 13, 2013
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం హీరోయిన్ గా మిస్ ఇండియా ౨౦౧౨ ఎరికా ఫెర్నాండెజ్ నటించబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం హిందీలో తాను నటించిన "లవ్ ఇస్ నాట్ మాతేమటిక్స్" చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అదే విధంగా తెలుగులో "డేగ" అనే చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడికి, బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చేసరికి తీన్మార్ డాన్స్ ఆడుతుందని ఫిల్మ్ నగర్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఇదే నిజమైతే బాలయ్య ఖాతాలో మరొక హీరోయిన్ ప్లాప్ బట పట్టాల్సిందే. ఎందుకంటే... గతంలో ఇపుడున్న అగ్ర కథా నాయికలు తప్ప.. బాలయ్యతో నటించిన అందరు హీరోయిన్స్ అవకశాలు రాక స్టేజ్ షో లకు పరిమితం అవుతున్నారు. మరి ఈ మిస్ ఇండియా సుందరి పరిస్థితి ఏమవుతుందో త్వరలోనే తెలియనుంది.