English | Telugu
కార్తీక్ కోసం వెతుకుతున్నా...
Updated : Jun 14, 2013
ఏ హీరోయిన్ కైనా స్టార్ హీరోయిన్ గుర్తింపు అనేది మాములుగా ఓ నాలుగైదు సినిమాల తర్వాత వస్తుంది. కానీ సమంతకు మాత్రం తన తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా పేరొచ్చింది. "ఏమాయ చేశావే" చిత్రంతో తెలుగు వారికీ పరిచయమైనా ఈ అమ్మడు, ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ఎంజెల్. మరి ఇలాంటి ఎంజెల్ తన తెలుగు సినిమా ఎంట్రి గురించి ఏం చెప్తుందో చూద్దామా?
కుటుంబం :
"ఏమాయ చేశావే" లో జెస్సి కుటుంబం ఎంత పద్దతిగా, సాంప్రదాయంగా ఉంటుందో.. మా ఇల్లు కూడా అలాగే ఉంటుంది. అమ్మ నినెట్(మలయాళీ), నాన్న ప్రభు(తెలుగు). కానీ ఇక్కడ మాత్రం నాకు ఇద్దరన్నయ్యలున్నారు(జోనాథన్, డేవిడ్). నేనొక యావరేజ్ స్టూడెంట్ నే. మాది 12 మంది ఫ్రెండ్స్ గ్యాంగ్. అందరం కలిసి బాగా అల్లరి చేసేవాళ్ళం. ఎంతంటే లెక్చరర్లతో తిట్టించుకునేంతగా. ఎంత అల్లరి చేసిన కూడా ఎగ్జామ్స్ టైం లో మాత్రం కనీసం పాసయ్యేలా చదివి, ఎలాగోలా గట్టేక్కేవాళ్ళం.
సినిమాల్లోకి ఎంట్రీ :
అప్పట్లో పాకెట్ మనీ కోసం సరదాగా మోడలింగ్ లోకి దిగి, కొన్ని వాణిజ్య ప్రకటనలు చేశాను. వీటిని చుసిన రవి వర్మన్ అనే సినిమాటోగ్రాఫర్, తాను దర్శకత్వం వహించే మొదటి చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ అతను వేరే సినిమాలతో బిజీ గా ఉండటంతో ఆ చిత్రం ఆగిపోయింది. అయితే ఆ తర్వాత "కుర్రాల్లోయ్ కుర్రాళ్ళు"(తెలుగులో) చిత్రం షూటింగ్ టైం లో గౌతమ్ మీనన్ "ఏమాయ చేశావే" తెలుగు వర్షన్ కి ఆడిషన్స్ పెట్టారని తెలుసుకొని ఫోటోలు పంపించా. మూడు రోజుల తర్వాత గౌతమ్ ఆఫీసు నుండి కాల్ వస్తే వెళ్ళాను. అక్కడ గౌతమ్ నాకు కాఫీ షాప్ సీన్ ఇచ్చి చేయించారు. ఇంకేముంది... సీన్ కట్ చేస్తే 3 డేస్ తర్వాత హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లుగా కాల్ వచ్చింది. గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ అనేసరికి స్క్రిప్టు కూడా వినకుండా సంతకం చేశాను. అలాగే రాజమౌళి లాంటి దర్శకుడు అడగగానే "ఈగ" చిత్రం స్క్రిప్టు కూడా వినకుండా సంతకం చేసేశా.
ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాను. తెలుగులో ఎన్.టి.ఆర్.తో "రామయ్యావస్తావయ్యా" "రబస", నాగచైతన్య తో "మనం" "ఆటోనగర్ సూర్య", బన్నీతో "రేసు గుర్రం", పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నా.
మీతో పనిచేసిన నటుల గురించి:
చైతూ చాలా ఫ్రెండ్లీ. మొదట్లో తెలుగు నాకు రాకపోతే ధైర్యం చెప్పేవాడు. తారక్ డైలాగులు చెప్పడంలో సూపర్. ఎంత పెద్ద డైలాగ్ అయిన కూడా ఒకే టేక్ లో చెప్పెసేవాడు. డాన్సులు ఆదరగొడతాడు. ఇక మహేష్ చాలా సైలెంట్ గా ఉంటూనే అందరిని ఆటపట్టిస్తుంటాడు. చాలా సరదాగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉంటారు. షాట్ లో సీన్ చేసేసి, తన పని ఏంటో తాను చూసుకుంటాడు. బట్ చాలా మంచి వ్యక్తి. సిద్ధార్థ్ సెట్లో చాలా హెల్ప్ చేసేవాడు. ఏదైనా విషయాన్నీ ఈజీ గా అర్థమయ్యేలా చెప్పేవాడు.
ప్రేమ, పెళ్లి :
ప్రేమ అనేది ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు కానీ, ఓసారి నా సీనియర్ ను ఇష్టపడ్డాను. అది కేవలం ఆకర్షణ మాత్రమే. నేనెవరికి లవ్ లెటర్స్ రాయలే కానీ, నాకు కొంత మంది రాశారు. ఇక పెళ్లి విషయంలో నా నిర్ణయం పై మా ఇంట్లో వాళ్ళకి చాలా నమ్మకం. సో... నేనేం నిర్ణయం తీసుకున్న అది కరెక్ట్ గానే ఉంటుందని వారి నమ్మకం. అయితే నాకు కాబోయేవాడు మాత్రం "ఏం మాయ చేశావే"లో కార్తీక్ లాగా ఉంటే చాలు. అలాంటి వాడు కనబడితే నాకు ఓకే.
మరచిపోలేని ప్రశంస :
ఓ వేదికపై "ఏమాయ చేశావే" చిత్రం గురించి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ... ఈ చిత్రంలో నటించిన చైతన్య నటనకు 48 మార్కులు , సమంతకు 52 మార్కులు ఇస్తానని అనడం నాకు బాగా నచ్చింది.
డ్రీం రోల్ :
డ్రీం రోల్ ఏం లేదు కానీ... ఎప్పటికైనా "The Best Actress Award goes to Samantha"అని అనిపించుకోవాలనేది నా కల.
N.S.