English | Telugu
అల్లుడొచ్చాడు...ఇరగదీసాడు...
Updated : Jun 22, 2013
రజనీకాంత్‌కు అల్లుడు కావడానికి ముందే ధనుష్ హీరో అయినప్పటికీ.. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను అర్ధాంగిగా చేసుకున్నాక అతని పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా "వై దిస్ కొలవరి" పాటతో అతని గొంతు మాత్రమే కాదు, పేరు కూడా ప్రపంచవ్యాప్తమైపోయింది.
ఇప్పుడు తాజాగా "రాన్‌ఝన్నా" చిత్రంతో మరోసారి అందరి దృష్టిని అతగాడు అమితంగా ఆకర్షిస్తున్నాడు. సోనమ్‌కపూర్ జంటగా "తను వెడ్స్ మను" ఫేమ్ ఆనంద్ రాయ్ దర్శకత్వంలో రూపొంది నిన్న విడుదలైన "రాన్‌ఝన్నా"కు విపరీతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ధనుష్ పెర్‌ఫార్మెన్స్‌కు ప్రత్యేకమైన ప్రశంసలు లభిస్తున్నాయి. మన సౌతిండియా హీరోస్‌లో ఎవరికీ లేని విధంగా రజనీకాంత్‌కు హిందీలో మంచి మార్కెట్ ఉంది. "శివాజి, రోబో" వంటి చిత్రాలు అక్కడ కూడా మంచి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు రాన్‌ఝన్నా" చిత్రంతో ధనుష్ కూడా బాలీవుడ్‌లో మంచి బోణీ కొట్టడం ద్వారా.. "మామకు తగ్గ అల్లుడు" అనిపించుకుంటున్నాడు!