English | Telugu

మరి ఇతని పరిస్థితి ఏంటి?

పూరి జగన్నాధ్‌లా మరీ స్పీడుగా సినిమా వెంట సినిమా చేయకపోయినా.. రాజమౌళిలా మరీ లేటు చెయ్యడు వి.వి.వినాయక్. అటువంటి వినాయక్.. తన తాజా చిత్రానికి ఎంతకీ సబ్జెక్ట్ సెట్ అవ్వకపోతుండడంతో విసుగు చెందుతున్నాడనే వార్తలు వినవస్తున్నాయి. రామ్‌చరణ్‌తో వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన "నాయక్" ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. అంటె అప్పుడే అమూల్యమైన ఆరు నెలల కాలం కరిగిపోయింది.

అయినప్పటికీ.. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తను రూపొందించ తలపెట్టిన చిత్రం పరిస్థితి "ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్న చందంగా ఉండడం వినాయక్‌ను కాస్తంత చిరాకు పెడుతోందని సమాచారం అందుతోంది. ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమై మూడు నెలలు పైనే అవుతున్నప్పటికీ.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది!