English | Telugu
భయపడుతున్న జ్ఞానవేల్
Updated : Jun 22, 2013
"యుగానికి ఒక్కడు", "ఆవారా", "యముడు" చిత్రాలతో వరుస విజయాలు సాధించడంతో "స్టూడియో గ్రీన్" అనే నిర్మాణ సంస్థ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. సూర్య, కార్తీల దగ్గర బంధువైన జ్ఞానవేల్‌రాజా చాలా మంది నిర్మాతలకు రోల్ మోడల్ అయిపోయాడు.
అయితే, ఆ తర్వాత వచ్చిన "మల్లిగాడు, శకుని, బ్రదర్స్, బ్యాడ్‌బోయ్" చిత్రాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో "స్టూడియో గ్రీన్" గుడ్‌విల్‌కు భారీగా గండి పడింది. అందుకే తాజా చిత్రం "సింగం" (యముడు పార్ట్2")ను "స్టూడియో గ్రీన్" బ్యానర్‌పై కాకుండా.. "ప్రిన్స్ పిక్చర్స్" అనే కొత్త బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. ఈ చిత్రమైన విజయం సాధిస్తుందో లేదోనని జ్ఞానవేల్ రాజా భయపడుతున్నారట.