English | Telugu
ఎస్.జె. సూర్య డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ 'కిల్లర్'
Updated : Jun 27, 2025
మల్టీ టాలెంటెడ్ ఎస్.జె. సూర్య పదేళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'కిల్లర్'. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య హీరోగా నటిస్తుండటమే కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్, ఎస్.జె. సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వి.సి. ప్రవీణ్, బైజు గోపాలన్.
‘వాలి’, ‘ఖుషీ’, ‘న్యూ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్.జె. సూర్య.. ఈ సినిమాకు భారీ తారాగణాన్ని తీసుకొస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది.
"కిల్లర్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయి సినిమా ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతిభ గల నటులు, సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రంగా రూపొందించబోతున్నాం" అని నిర్మాతలు తెలిపారు.
త్వరలోనే ఈ చిత్ర తారాగణం, సాంకేతిక బృందం, కథా నేపథ్యం వంటి విషయాలను వెల్లడించనున్నారు.