English | Telugu

మైసా ఫస్ట్ లుక్.. అనుష్కను గుర్తు చేస్తున్న రష్మిక!

'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా' వంటి వరుస పాన్ ఇండియా విజయాలతో ఫుల్ జోష్ లో ఉంది రష్మిక మందన్న. 'సికందర్' షాక్ ఇచ్చినప్పటికీ.. రీసెంట్ గా విడుదలైన 'కుబేర'తో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ప్రకటించింది. అది కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. (Rashmika Mandanna)

అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ లో రష్మిక చేస్తున్న మూవీ ప్రకటన నిన్న వచ్చింది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఈ సినిమాకి 'మైసా' అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంది. చేతిలో ఆయుధం పట్టి, నెత్తుటి మరకలతో గర్జిస్తున్న సివంగిలా రష్మిక కనిపిస్తోంది. అనుష్క తర్వాత ఈ జనరేషన్ లో ఇంతటి పవర్ ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేసిన హీరోయిన్స్ తక్కువనే చెప్పాలి. ఆ లోటుని రష్మిక తీర్చేలా ఉంది. ఈ సినిమా హిట్ అయితే రష్మిక స్టార్డం మరోస్థాయికి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. (Mysaa Movie)

'మైసా' ఫస్ట్ లుక్ లో నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసిన రష్మిక.. సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.