English | Telugu
ఎన్టీఆర్‌తో మోక్షజ్ఞ.. ఫొటో వైరల్
Updated : Aug 21, 2023
నందమూరి నట వారసులు ఒకే ఫ్రేమ్‌లోకనిపిస్తే ఎలా ఉంటుంది. అభిమానులకు పండగేనని చెప్పాలి. ఇప్పుడదే జరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఒకే ఫొటోలో కనిపిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉండే నందమూరి సుహాసిని కుమారుడు వివాహం జరిగింది. ఈ వేడుకకి ఫ్యామిలీ అంతా హాజరైంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మోక్షజ్ఞ, కళ్యాణ్ రామ్‌లు సెంటరాఫ్ ది ఎట్రాక్షన్ అయ్యారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ కూడా కలుసుకున్నవీడియో కూడా వైరల్ అవుతుంది. దీంతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ కలిసి ఉన్న ఫొటో కూడా వైరల్ అవుతుంది.
ముఖ్యంగా ఈ నందమూరి మోక్షజ్ఞ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకు ముందుతో పోల్చితే తను సన్నబడి కనపడుతున్నారు. త్వరలోనే బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ నయా లుక్, అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో ఉన్నది నెట్టింట వైరల్ అవుతుంది. మరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలకృష్ణ మాట్లాడిన సందర్భాల్లో త్వరలోనే సినీ రంగ ప్రవేశం ఉంటుందని చెబుతున్నారే కానీ, క్లారిటీగా చెప్పటం లేదు. మరో వైపు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నెట్టింట ఎప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఆయన్ని డైరెక్ట్ చేయబోయేదెవరా? అనేది అందరిలోనూ మొదులుతున్న సందేహం. ఆ లిస్టులో చాలా మంది పేర్లే వినిపించినా ఇంకా ఏదీ ఫైనలైజ్ అయినట్లు తెలియటం లేదు. రీసెంట్‌గా అయితే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల పేరు కూడా గట్టిగానే వినిపించింది మరి.