English | Telugu
‘గుంటూరు కారం’ రిలీజ్ డేట్‌పై మహేష్ క్లారిటీ
Updated : Aug 21, 2023
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కొత్త షెడ్యూల్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఇంకా సినిమా షూటింగ్ 80 రోజుల మేరకు పూర్తి చేయాల్సి ఉందని సినీ సర్కిల్స్ టాక్. దీంతో సినిమా షూటింగ్‌ను ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో అనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో సందేహాలు మొదలయ్యాయి. దీంతో కొందరు ‘గుంటూరు కారం’ సినిమా రాబోయే సంక్రాంతికి కూడా వచ్చే అవకాశం లేదని అందరూ అంటున్నారు. నెట్టింట జోరుగా వినిపిస్తోన్న ఈ వార్తలపై మేకర్స్ ఏమీ రియాక్ట్ కావటం లేదు.
ఈ నేపథ్యంలో ‘గుంటూరు కారం’ రిలీజ్ డేట్‌పై మహేష్ బాబు క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పేశారు. హీరోనే ఓపెన్‌గా చెప్పటంతో సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందంటూ వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయ్యింది. ఓ మొబైల్ కంపెనీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మహేష్‌కు త్రివిక్రమ్‌తో చేస్తోన్న ‘గుంటూరు కారం’ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్య దేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న చిత్రమిది. ఇందులో మహేష్ సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపిస్తారని సమాచారం.
గుంటూరు కారం సినిమాను నవంబర్, డిసెంబర్ నాటికంతా పూర్తి చేసి జనవరి నుంచి రాజమౌళి సినిమాపై ఫోకస్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.