English | Telugu

Akhanda 2: బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా అఖండ-2

Publish Date:Dec 15, 2025

  బాలయ్య బాక్సాఫీస్ గర్జన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో అఖండ-2  సోమవారం సాలిడ్ బుకింగ్స్   'అఖండ-2'తో నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ దగ్గర గర్జించారు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. వరుసగా ఐదోసారి బాలకృష్ణ ఈ ఫీట్ సాధించడం విశేషం. (Akhanda 2 Thaandavam)   2021లో వచ్చిన 'అఖండ'తో బాలయ్య హిట్ స్ట్రీక్ మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఇప్పుడదే బాటలో 'అఖండ-2' పయనించింది.   అఖండ-2 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. రెండో రోజు, మూడో రోజు కలిపి మరో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.   Also Read: 'ధురంధర్' బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లో 550 కోట్లు..!   ఇప్పట్లో అఖండ-2 జోరుకి బ్రేకులు పడేలా లేవు. నాలుగో రోజైన సోమవారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. బుక్ మై షోలో గంటకు ఐదు వేలకు తగ్గకుండా టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే.. ఈ మూవీ మండే టెస్ట్ పాస్ అయినట్లే.   వీక్ డేస్ లో నిలబడిందంటే.. సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. ప్రస్తుత బుకింగ్స్ చూస్తుంటే.. అఖండ-2 కి లాంగ్ రన్ ఉండటం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.150-200 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. దాంతో అఖండ-2 బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశముంది.    

Bad Girlz film locks Christmas release date

Publish Date:Dec 15, 2025

Bad Girlz, an entertainer directed by Phani Pradeep Dhulipudi, who has previously directed the successful '30 Rojullo Preminchadam Ela', locked release date. The film is being produced under the banners of Prashvitha Entertainment, Neeli Neeli Aakasam Creations, and NVL Creations. Anchal Gowda, Payal Chengappa, Roshini, Yashna, Rohan Surya, and Moin are the main actors in 'Bad Girlz'. The tagline for the film, 'Kani Chala Manchodlu', contradicts with the title in an interesting way. Sasidhar Nalla, Emmadi Soma Narsaiah, Ramisetti Rambabu, and Ravula Ramesh are producing this film. This Entertainer film is set to release on December 25th, on the occasion of Christmas. Director Phani Pradeep  Dhulipudi has described his movie as a complete entertainer that explores what it would be like if female characters headlined a Jathi Ratnalu or a MAD.    "We are very happy with how the film has shaped up. It's for everyone to like. You are in for a thorough entertainer," the director said. He added that the talented Anup Rubens has provided excellent music, and that the Oscar-winner Chandra Bose penned the lyrics for all the songs.  He further said, "The songs have come out very well. The recently releasaed song Ila Chusukuntane received very good response with 6 Million views. And Bad Girlz Anthem song is getting a good response as well in Social Media. We will be releasing the remaining songs soon. Please watch our movie in theatres."  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

తెలుగుదనం అంటే బాపు బొమ్మ, తెలుగుదనం అంటే బాపు సినిమా!

Publish Date:Dec 15, 2025

(డిసెంబర్‌ 15 చిత్రకారుడు, దర్శకుడు బాపు జయంతి సందర్భంగా..) బాపు.. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తన అందమైన చిత్రాలతో మధురానుభూతిని కలిగించి, వ్యంగ్య చిత్రాలతో నవ్వులు పూయించిన మేటి చిత్రకారుడు. అలాగే తన సినిమాలతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని దర్శకుడు. ఆయన వేసిన బొమ్మ చూసినా, ఆయన తీసిన సినిమా చూసినా ఇది ఖచ్చితంగా బాపు మేథస్సు నుంచి పుట్టిందేనని సాధారణ ప్రజలు సైతం గుర్తిస్తారు. తన కళతో ప్రజలపై అంతటి ప్రభావాన్ని వేశారు. బొమ్మలు వేయడంలో ఎంతటి ప్రతిభ కనబరిచేవారో, అక్షరాలను అందంగా రాయడంలోనూ తన ప్రత్యేకతను చూపించేవారు. బాపు బొమ్మను ప్రచురించని పత్రిక లేదు. అలాగే నవలల కోసం బాపు వేసినన్ని బొమ్మలు మరే చిత్రకారుడూ వెయ్యలేదు. అంతేకాదు, తన పేరుతో ఒక ఫాంట్‌ను క్రియేట్‌ చేసి అక్షరాల్లోనూ అందాలు ఒలకబోసిన ఘనాపాటి బాపు. అందుకే బాపు రాత, బాపు గీత అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది.    ఇక సినిమాల విషయానికి వస్తే.. అవన్నీ బాపు చెక్కిన శిల్పాలు. కథాంశం ఏదైనా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు బాపు శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన సినిమాల్లోని పాత్రలు, సన్నివేశాలు, మాటలు, పాటలు, నేపథ్య సంగీతం అన్నీ బాపు గుండెల్లో నుంచి బయటికి వచ్చినట్టుగానే అనిపిస్తాయి. ప్రేక్షకుల మనసులో మధురానుభూతిని కలిగిస్తాయి. తన బొమ్మల్లో ఎంతటి భావుకత్వం ఉంటుందో, తెరపై కదిలే బొమ్మల్లోనూ అదే భావుకత్వం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో కథానాయికలు బాపు గీసిన బొమ్మలకు ప్రాణం పోసినట్టుగానే ఉంటారు. ‘బాపు బొమ్మ’ అనే మాట ఎంత ప్రాచుర్యం పొందిందో, బాపు సినిమాల్లోని కథానాయికలకు కూడా అంతటి ప్రాధాన్యం దక్కింది.   బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. 1933 డిసెంబరు 15న పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి లాయర్‌ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. బాపు చిరకాల మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ. శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే అన్నంతగా వారి స్నేహబంధం చిరకాలం కొనసాగింది. నిజమైన స్నేహానికి నిదర్శనంగా బాపు, రమణలను చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కలిసి సృష్టించిన బుడుగు, సీగాన పెసూనాంబ, రెండుజెళ్ళ సీత, అప్పుల అప్పారావు, గిరీశం, లావుపాటి పెళ్ళాం-బొచ్చుకుక్క లాంటి బుజ్జి మొగుడూ శీర్షికలు పాఠకులకు గిలిగింతలు పెట్టేవి.    అలా కొన్నేళ్ళపాటు బాపు తన బొమ్మలు, కార్టూన్లతోనూ, రమణ తన రచనలతో పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రతిరోజూ సినిమాలు చూసేవారు. సినిమా చూసిన తర్వాత అందులోని తప్పుల గురించి చర్చించుకుంటూ మైళ్ల కొద్దీ నడిచి ఇంటికి చేరేవారు. అలా సినిమాలు చూస్తున్న ఆ ఇద్దరికీ మనమే సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనల్ని పేపర్‌పై పెట్టి రాసిన రమణ కథకు తన బొమ్మలతో స్క్రీన్‌ప్లే రచించేవారు బాపు. తను చేసిన ప్రతి సినిమాకీ అదే పద్ధతిని పాటించారు.    1952లో వచ్చిన ఇంగ్లీష్‌ సినిమా ‘హై నూన్‌’ స్ఫూర్తితో 1959లో ఆంధ్రపత్రికలో ‘సాక్షి’ అనే కథను రాశారు రమణ. ఆ సినిమాలోని కౌబాయ్‌ పాత్రను బల్లకట్టు కిష్టప్పగా మార్చి ఆ కథనే మరికొన్ని మార్పులతో కృష్ణ, విజయనిర్మల జంటగా ‘సాక్షి’ చిత్రాన్ని రూపొందించారు బాపు. 1967లో ఈ సినిమా విడుదలైంది. అప్పుడు మొదలైన బాపు, రమణల సినీ ప్రయాణం దాదాపు 45 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగింది. వీరిద్దరూ కలిసి 51 సినిమాలు చేశారు. తాము చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రస్తావించేవారు. దాన్నే ఎంతో అర్థవంతంగా తెరపై ఆవిష్కరించేవారు.    బాపు కొన్ని వేల బొమ్మలు వేశారు. వాటిలో ఏది గొప్పది అని చెప్పడం ఎంత కష్టమో ఆయన తీసిన 51 సినిమాల్లో ఏది గొప్పది అని చెప్పడం కూడా అంతే కష్టం. దేనికదే ప్రత్యేకం అన్నట్టుగా ఉంటాయి. తన సినిమాల్లోని పాత్రల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు బాపు. ఎంతో మంది నటీనటులకు బాపు సినిమాలు మంచి గుర్తింపుని, అంతకుమించి మంచి భవిష్యత్తునీ ఇచ్చాయి.    బాపు సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘ముత్యాల ముగ్గు’. 1975లో విడుదలైన ఈ సినిమాలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఇందులోని ప్రతి పాత్రలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా రావుగోపాలరావు పోషించిన కాంట్రాక్టర్‌ పాత్ర ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. అప్పట్లోనే ఈ సినిమాలోని రావుగోపాలరావు డైలాగులు రికార్డుల రూపంలో వచ్చాయంటే అవి ఎంత ప్రజాదరణ పొందాయో అర్థం చేసుకోవచ్చు. రామాయణం స్ఫూర్తితో రూపొందించిన ఈ సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. అలాగే ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఇషాన్‌ ఆర్య జాతీయ అవార్డు అందుకున్నారు.    సాక్షి తర్వాత బాపు దర్శకత్వం వహించిన సినిమాల్లో బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్లే రైలు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, రాధాకళ్యాణం వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొంది బాపు రూపొందించిన సినిమాల్లో క్లాసిక్స్‌గా నిలిచాయి. తెలుగులో ఘనవిజయం సాధించిన తన సినిమాలను హిందీలో కూడా రీమేక్‌ చేశారు బాపు. అలా 9 హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక 1990వ దశకంలో భారాభర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం గురించి, వారి బంధం గురించి తెలియజెప్పే కథతో రూపొందిన పెళ్లి పుస్తకం, మహిళల ఆత్మాభిమానం గురించి, వారి శక్తి గురించి తెలియజెప్పే చిత్రంగా వచ్చిన మిస్టర్‌ పెళ్లాం చిత్రాలు ఘన విజయం సాధించాయి. బాపు దర్శకత్వం వహించిన చివరి చిత్రం 2011లో వచ్చిన శ్రీరామరాజ్యం.    చిత్రకారుడిగా, కార్టూనిస్ట్‌గా, దర్శకుడిగా బాపు అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. 2013లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్రప్రభుత్వం బాపుని సత్కరించింది. అలాగే 1986లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌.. బాపుకి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చింది. ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు నంది అవార్డు అందుకున్నారు బాపు. అలాగే ఉత్తమ దర్శకుడిగా రెండుసార్లు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది. అంతేకాదు ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా బాపుని వరించింది. ఇవికాక వివిధ సంస్థలు అనేక అవార్డులతో ఆయన్ని సత్కరించాయి.    తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రాణ స్నేహితులుగా బాపు, రమణలకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. స్నేహానికి మారుపేరుగా జీవితాంతం కలిసే ఉన్న బాపు, రమణ.. 2011లో విడిపోవాల్సి వచ్చింది. అది కూడా ముళ్ళపూడి వెంకటరమణ మరణంతో. 2011 ఫిబ్రవరి 24 అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. స్నేహితుడి మరణం బాపుని బాగా కుంగదీసింది. ఎంతో మనో వేదనకు లోనయ్యారు. బాపు జీవితంలో అనేకసార్లు గుండెపోటు వచ్చింది. ఆఖరు సారి 2014 ఆగస్ట్‌లో గుండెపోటు రావడంతో చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 2014 ఆగస్ట్‌ 31న తుదిశ్వాస విడిచారు బాపు. ఆయన అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపించింది. 

Dhurandhar: పది రోజుల్లో 550 కోట్లు.. టార్గెట్ 1000 కోట్లు..!

Publish Date:Dec 15, 2025

  'ధురంధర్' బాక్సాఫీస్ ఊచకోత పది రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ నెక్స్ట్ టార్గెట్ 'ఛావా' ఫుల్ రన్ లో వెయ్యి కోట్లు?   ప్రస్తుతం బాలీవుడ్ లో 'ధురంధర్'(Dhurandhar) పేరు మారుమోగిపోతోంది. డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది.   ఈ ఏడాది 500 కోట్ల క్లబ్ లో చేరిన మూడవ హిందీ సినిమా 'ధురంధర్' కావడం విశేషం. ఫిబ్రవరిలో విడుదలైన 'ఛావా' ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక జులైలో విడుదలైన 'సైయారా' కూడా రూ.580 కోట్లతో సత్తా చాటింది. ఇప్పుడు 'ధురంధర్' పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా ఇండియాలో రూ.430 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్ లో రూ.120 కోట్లు రాబట్టింది.   Also Read: బాలయ్య తాండవం.. అఖండతో ఓవర్సీస్ లో సంచలన రికార్డు!   రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన 'ధురంధర్' చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ స్పై థ్రిల్లర్ విడుదల రోజు పరవాలేదు అనే టాక్ తో సరిపెట్టుకుంది. ఆ తరువాత మౌత్ టాక్ తో రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది.   'ధురంధర్' బాక్సాఫీస్ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పుడు థియేటర్లలో ఇతర భారీ హిందీ చిత్రాల తాకిడి లేదు. పైగా, 'ధురంధర్' మౌత్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర స్టడీగా రన్ అవుతోంది. మరో రెండు వరాల వరకు ఇదే జోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే త్వరలో 'ఛావా'ను క్రాస్ చేయడమే కాకుండా.. రూ.1000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. చూద్దాం మరి.. ఫుల్ రన్ లో 'ధురంధర్' ఎంత కలెక్ట్ చేస్తోందో.    

Bigg Boss 9 Telugu winner : బిగ్ బాస్ సీజన్-9 విజేత పవన్ కళ్యాణ్.. రన్నరప్ గా తనూజ!

Publish Date:Dec 15, 2025

    బిగ్ బాస్ సీజన్-9 ముగియడానికి చివరి వారం మిగిలి ఉంది. హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో భరణి ఎలిమినేషన్ అయ్యాడు. గత వారం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉండగా.. సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఇప్పుడు అయిదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.      ప్రతీ సీజన్ లో లాగే ఈ సీజన్ కూడా టాప్-5 ఉంటారని బిగ్ బాస్ మామ కన్ఫమ్ చేశాడు. డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఇక నిన్న అర్థరాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉన్నాయి. ఎవరు మీ ఫెవరెట్ కంటెస్టెంటో వారికి ఓట్ వేసుకోమని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. ఇక నిన్న మొదలైన ఓటింగ్ పోల్ రసవత్తరంగా సాగుతోంది.   అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్ లో.. పవన్ కళ్యాణ్ పడాలకి అత్తధిక ఓటింగ్ నమోదవ్వగా.. సంజనకి లీస్ట్ ఓటింగ్ పడింది‌. 45.69 శాతం ఓటింగ్ తో పవన్ కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉండగా, 27.92 శాతం లో ఓటింగ్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. 11.84 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉన్నాడు.  ఇక లీస్ట్ లో సంజన, డీమాన్ పవన్ ఉన్నారు. 8.41 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. 6.14 శాతం ఓటింగ్ తో సంజన లీస్ట్ లో ఉంది.      ఇక ఓటింగ్ కి మరో నాలుగు రోజులు ఉంది. శుక్రవారం వరకు జరిగే ఓటింగ్ ప్రక్రియలో ఎవరికి అత్యధిక ఓటింగ్ వస్తుందో వారే బిగ్ బాస్ సీజన్-9 విజేత అవుతారు. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ పోల్ అనాలిసిస్ ప్రకారం కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పవన్ కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నాడు. అతడే ఈ సీజన్-9 విజేత అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే తనూజకి కూడా ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే తనని బిగ్ బాస్ దత్తపుత్రిక అంటారు. అంటే తనకి సపోర్ట్ ఎక్కువగా ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు కానీ కామన్ మ్యాన్ రావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. మరి టాప్-5 లో ఉన్నవారిలో ఎవరికి మీ ఓట్ కామెంట్ చేయండి.        

ఎన్టీఆర్ 'డ్రాగన్' కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Publish Date:Dec 14, 2025

  జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్' టైటిల్ పరిశీలనలో ఉంది. (NTR Neel)   డ్రాగన్ సినిమాని 2026 జూన్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఆ తేదీకి విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. 2026 డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అది మిస్ అయితే.. 2027 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.   కొంత విరామం తరువాత డ్రాగన్ షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఈ డిసెంబర్ 13 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. నెలరోజుల పాటు హైదరాబాద్, జోధ్‌పూర్ లో షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఎన్టీఆర్-రుక్మిణి వసంత్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఆ తరువాత విదేశాల్లో ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు.  

Is Mahesh Babu playing five roles in Varanasi?

Publish Date:Dec 10, 2025

Superstar Mahesh Babu and legendary director SS Rajamouli are coming together for the first time with Vaaranaasi. The movie announcement video has created global sensation with stunning VFX and high-end concept. The movie team have been maintaining a tight lip about shooting updates, post the release of the video.  Now, the rumors about Mahesh Babu playing five roles are going around across the internet. It is stated that along with Lord Rama, Rudra, he is playing roles like Lord Shiva, A traveller King of Ancient India and another hidden role. They are also staring that the movie is being divided into two parts.  Rumors are also aplenty that Mahesh is taking Rs.50 crore salary per annum for the project till the movie shoot is over. He might be looking at a huge paycheck of Rs.150-175 crores as his remuneration for the film. Rajamouli is said to be planning even bigger schedule from January till March 2026, in RFC.  Well, some close sources to the team have rubbished five roles for Mahesh rumors. They stated that he might be appearing in different get-ups but only two roles as Rama and Rudra. And they did not confirm about MB's salary or two parts rumors. Priyanka Chopra and Prithviraj Sukumaran are playing other leading roles.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969