English | Telugu

ప్రేమలో పడిన అమీర్ ఖాన్.. వయసు 60 ఏళ్ళు

-అమీర్ ప్రేమ పురాణం
-ఏ నిర్ణయం తీసుకున్నాడు
-ఏం చేయబోతున్నాడు

అభిమానులు భారతీయ సినీ ప్రేమికులు అత్యంత గౌరవించే నటుల్లో 'అమీర్ ఖాన్'(Aamir Khan)ఒకరు. సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో ప్రయోగాత్మక క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా అమీర్ ఎన్నో ఎన్నో హిట్స్ లో ఒకటైన దంగల్ పేరు పైనే ఉంది. దీన్ని బట్టి సరైన సినిమా పడితే అమీర్ చరిష్మా ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా కట్ అవుట్ కి తగ్గ కథ కుదరకపోవడంతో పరాజయాలని ఎదురుకుంటున్నాడు.ఈ ఏడాది ఆగష్టు లో రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ ల 'కూలీ' లో గెస్ట్ రోల్ లో కనపడి అలరించాడు.

రీసెంట్ గా అమీర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతు నా మొదటి భార్య రీనా(Reena Dutta)చాలా అద్భుతమైన వ్యక్తి. భార్య భర్తలుగా విడిపోయామే తప్ప మనుషులుగా కాదు. సెకండ్ వైఫ్ కిరణ్(kiran Rao)కూడా అంతే. కానీ మళ్ళీ 60 ఏళ్ళ వయసులో ప్రేమ దొరుకుతుందని అనుకోలేదు. గౌరీ స్ప్రాట్(Gauri Spratt)మంచి వ్యక్తి. నా జీవితంలోకి ప్రశాంతతని, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. నా వివాహాలు సఫలం కాకపోయినా చాలా విషయాల్లో ఆ ముగ్గుర్ని ఆదర్శంగా తీసుకుంటాను. ఒక వ్యక్తిగా నన్ను చాలా ప్రభావితం చేసారని చెప్పుకొచ్చాడు.

Also read: ఈ నెల 12 న థియేటర్స్ లోకి ఎనిమిది చిత్రాలు.. పండుగ వచ్చినట్టేనా!

అమీర్ వివాహ విషయాల్ని ఒకసారి చూసుకుంటే అమీర్ ఫిలిం ప్రొడ్యూసర్ అయిన రీనా కి 1986 లో వివాహం జరగగా 2002 లో డైవర్స్ తీసుకున్నారు. ఈ ఇద్దరికి ముగ్గురు పిల్లలు. రెండో వివాహం దర్శకురాలైన కిరణ్ రావు తో 2005 లో జరగగా ఆరు సంవత్సరాల అనుబంధం తర్వాత 2021 లో విడిపోయారు. ఇక గౌరీ స్ప్రాట్ ని ఈ సంవత్సరం మార్చిలో వివాహం చేసుకున్నట్టుగా అమీర్ ప్రకటించాడు. ఆమెకి కూడా సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.సినిమాల పరంగా చూసుకుంటే ప్రొడ్యూసర్ గా రెండు విభిన్న చిత్రాలని ప్రకటించిన అమీర్ హీరోగా తదుపరి చిత్రం లోకేష్ కనగరాజ్ తో ఉండచ్చగానే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది.