English | Telugu

ప్రముఖ దర్శకుడు అరెస్ట్..!

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్(Vikram Bhatt), ఆయన సతీమణి శ్వేతాంబరిని ఉదయ్ పుర్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇందిరా ఐవిఎఫ్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియాను.. 30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది.

తన దివంగత భార్య జీవితం ఆధారంగా సినిమా తీయాలంటూ అజయ్ ముర్దియా.. విక్రం భట్‌ దంపతులను సంప్రదించారు.

ఈ క్రమంలో రూ.47 కోట్లు పెట్టుబడి పెడితే.. నాలుగు సినిమాలు చేస్తానని, ఫలితంగా దాదాపు 200 కోట్ల లాభం వస్తుందని భట్ హామీ ఇచ్చారని అజయ్ ఆరోపించారు.

అయితే, రూ.30 కోట్లు తీసుకుని రెండు ప్రాజెక్ట్ లు మాత్రమే కంప్లీట్ చేశారని.. మిగిలినవి తీయకుండా తనని మోసం చేశారంటూ.. అజయ్ ముర్దియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో గతంలో ఇచ్చిన నోటీసులకు విక్రమ్ భట్ దంపతులు స్పందించకపోవడంతో.. తాజాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే అజయ్ ముర్దియా చేసిన ఆరోపణలను విక్రమ్ భట్ ఖండించారు. తన సినిమాలకు పని చేసిన టెక్నీషియన్స్ కి అజయ్ డబ్బులు ఇవ్వాల్సి ఉందని, దాని నుంచి తప్పించుకోవడం కోసమే ఇలాంటి తప్పులు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.