English | Telugu
Akhanda 2: అఖండ 2 చూస్తున్న మహిళకి పూనకం.. పూర్తి నిజం ఇదే
Updated : Dec 15, 2025
-అఖండ 2 జోరు
-బాలయ్య, శివుడి తాండవంకి భారీ రెస్పాన్స్
-ఆ మహిళ ఎవరు
-ఎక్కడ జరిగింది
ప్రస్తుతం 'అఖండ 2 '(Akhanda 2)మానియాతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా మొత్తం ఊగిపోతోంది. డేవోషనల్ కంటెంట్ కి అన్ని రకాల ఎమోషన్స్ కుదరడంతో పాటు శివస్థుతుడైన అఘోరగా బాలయ్య(Balakrishna)తన నట విశ్వరూపాన్ని చూపించడంతో అభిమానులేకాకుండా ప్రేక్షకలోకం మొత్తం అఖండ కి దాసోహమయ్యింది. ఎంతలా అంటే మూవీలో ని చాలా సీన్స్ చాలా మందికి ఫేవరేట్ గా నిలవడమే కాకుండా సదరు సీన్స్ గురించి చాలా గర్వంగా తమకి తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు. రిపీట్ ఆడియెన్సు కూడా పెద్ద సంఖ్యలోనే థియేటర్స్ లో దర్శనమిస్తున్నారు. బాలయ్యకి తోడుగా పరమేశ్వరుడు, థమన్ కలవడంతో కొంత మంది ఆడవాళ్ళకైతే థియేటర్స్ లోనే పూనకాలు కూడా వస్తున్నాయి.
ఇందుకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)ప్రకాశం జిల్లా ఒంగోలు(Ongole)లోని ఒక మహిళ తన భర్త తో కలిసి అఖండ 2 చూడటానికి వెళ్ళింది. క్లైమాక్స్ సీన్ లో శివుడు, అఖండ తాండవం ఆడే సీన్‌ని చూస్తూ సదరు మహిళ ఆ ఇద్దరికి దండం పెడుతూ చేతులు ఊపుతూ, శరీరాన్ని కదిలిస్తూ పూనకంతో ఊగిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఆమె భర్త అదుపు చేసే ప్రయత్నం చేశాడు. థియేటర్‌లోని ఇతర ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఆమెను చూస్తు ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీన్ని బట్టి మూవీ ప్రారంభం నుండే ప్రేక్షకులు అఖండ కి ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.
ఇక స్క్రీన్‌పై బాలయ్య కనిపించగానే అభిమానులు లేచి నిలబడి విజిల్స్, చప్పట్లతో హంగామా చేస్తున్నారు. క్లైమాక్స్ దగ్గరయ్యే కొద్దీ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే శివ స్తోత్రాలు అందర్నీ ఊర్రూతలూగిస్తున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తున్న అభిప్రాయం కలగడంతో పాటు పిల్లలు, పెద్దలు అంతా మువీని ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త మంది అభిమానులైతే థియేటర్‌ల వద్ద ఏకంగా పూజలు, అభిషేకాలు కూడా చేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా మూడు రోజులకే 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య రికార్డు కలెక్షన్స్ సాధించడం పక్కా.