English | Telugu

మహేష్ కి తండ్రిగా లెజండ్రీ యాక్టర్ ! రాముడు కదా ఫ్యాన్స్ ఏమంటారో మరి

-ఆయన ఓకేనా!
-వారణాసి అప్ డేట్ ఏంటి
-ఫ్యాన్స్ ఏమంటారు

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu),దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli)అభిమానులే కాకుండా ప్రపంచ సినీ ప్రేమికులు మొత్తం 'వారణాసి'(Varanasi) ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని తమ ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తూ వస్తున్నారు. దీంతో నిత్యం వారణాసి అప్ డేట్స్ గురించి సెర్చ్ చేయడం వాళ్ళ నిత్యదినచర్యల్లో ఒక భాగమైపోయింది.ఈ క్రమంలోనే వారణాసి కాస్టింగ్ కి సంబంధించి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక న్యూస్ వాళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది.


అంతలా వాళ్ళల్లో ఆనందాన్ని నింపడానికి కారణం వారణాసిలో లెజండ్రీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj)నటిస్తూ ఉండటమే. అవును వారణాసిలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో చేస్తున్నాడని, సదరు క్యారక్టర్ మహేష్ తండ్రి క్యారక్టర్ అని కూడా అంటున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరిది చాలా పెద్ద హిట్ కాంబో. ఎక్కువ శాతం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా తండ్రి కొడుకులుగా చేసిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. వారణాసి చిత్ర యూనిట్ ప్రకాష్ రాజ్ చేస్తున్న విషయాన్నీ త్వరలోనే అధికారకంగా ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Also read: ప్రముఖ దర్శకుడు, అతని భార్య దారుణ హత్య.. ఎవరు ఆ కిల్లర్!


ఇక ఈ న్యూస్ పై సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టుని మహేష్ తండ్రిగా ఎంచుకున్నారంటే ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై వండర్ ని సృష్టించే క్యారక్టరే అయ్యి ఉంటుంది. పైగా ప్రకాష్ రాజ్ కూడా తన క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఒప్పుకుంటాడు. ఆల్రెడీ మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ఏర్పడిందని అంటున్నారు. ఇక వారణాసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. 2027 వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.


పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.