English | Telugu
త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఫిక్స్
Updated : Jul 10, 2013
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఎప్పటి నుంచో వీరిద్దరూ కలిసి చేద్దామనుకుంటున్నారు. ఆ ప్రాజెక్టుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ తో కలిసి "అత్తారింటికి దారేది" చిత్ర షూటింగ్ లో, అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రామయ్యా వస్తావయ్యా" చిత్ర షూటింగ్ లో ఎన్.టి.ఆర్ బిజీగా ఉన్నారు.