English | Telugu
జూలై చివర్లో రొమాన్స్ కు సిద్దం
Updated : Jul 10, 2013
ప్రిన్స్ హీరోగా డింపుల్, మానస హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం "రొమాన్స్". స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై నెల చివరి వారంలో విడుదల చేయనున్నారు. గుడ్ సినిమా గ్రూప్, మారుతి మీడియా ప్రొడక్షన్ బ్యానర్స్ లలో జి. శ్రీనివాస రావు, ఎస్.కె.ఎన్. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో విడుదలై మంచి స్పందనను సంపాదించుకుంటుంది.