English | Telugu

ఇలియానకు అతనే కావాలంట!

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చిన తీగ నడుము సుందరి ఇళియానా.. తొలి సినిమాతోనే మంచి సక్సెస్‌ అందుకున్న ఈ గోవాబ్యూటి తరువాత పోకిరి సినిమాతో ఒక్కసారిగా టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కి చేరిపోయింది.

తరువాత వరుసగా అవకాశాలు వచ్చిన సక్సెస్‌లు మాత్రం మొహం చాటేయటంతో ఇలియానాకు టాలీవుడ్‌లో అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

టాలీవుడ్‌ అవకాశాలు తగ్గుతుండగానే కోలీవుడ్‌, బాలీవుడ్‌ ల మీద కన్నేసిన ఇలియానా అక్కడ కూడా మంచి అవకాశాలనే చేజిక్కించుకుంది.

కోలివుడ్‌ లో విజయ్‌ లాంటి టాప్‌ స్టార్‌తో నటించటంతో పాటు బాలీవుడ్‌ నటించిన బర్ఫీ సినిమాతో హిందీ సినీ ప్రముఖుల దృష్టిలో కూడా పడింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా వరుసగా అవకాశాలు రాకపోవడంతో ప్రస్థుత ఈ భామ అడపాదడపా సినిమాలు చేస్తూ కాలీగా ఉంటుంది.

దీంతో ఇప్పుడు అందరూ ఇళియానా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు.. ఇప్పటికే ఓ ఆస్ట్రేలియన్‌ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్‌ చేస్తున్న ఇళియానా త్వరలోనే అతన్ని పెళ్లిచేసుకుంటుందన్న టాక్‌ వినిపిస్తుంది. ఇళియానా మాత్రం అలాంటిదేమి లేదని కొట్టి పారేస్తుంది.

ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం వంట చేసే మగాడే కావాలంటూ.. వద్దంటూనే తనకు కావాల్సిన వరుడికి ఉండాల్సిన క్వాలిటీస్‌ను చెబుతుంది..