English | Telugu
దొంగలకి దొంగల సినిమాలు నచ్చుతాయేమో
Updated : Jul 24, 2025
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానులతో పాటు సినీప్రేమికులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు'(HariHara Veeramallu)ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదలైంది. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచే అన్నిచోట్ల ప్రతేక్య 'షో' లు ప్రదర్శించడంతో అభిమానులతో పాటు పవన్ పొలిటికల్ పార్టీ 'జనసేన'(Janasena)కి చెందిన పలువురు ఎంఎల్ఏ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరమల్లుని వీక్షించడం జరిగింది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)రాష్ట్రానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి 'కందుల దుర్గేష్'(Kandula Durgesh)వీరమల్లుని చూడటం జరిగింది. ఈ సందర్భంగా ఒక మీడియా పర్సన్ కందుల దుర్గేష్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పవన్ రాజకీయాల్లో ఉంటు సినిమాల్లో చేస్తున్నాడు కాబట్టి వీరమల్లుని బాయ్ కాట్ చెయ్యాలని అంటున్నారు కదా అని అడగడం జరిగింది. అనంతరం దుర్గేష్ మాట్లాడుతు 'సినిమాల్లో నటించడం పవన్ గారి వృత్తి.
బ్యాన్ చెయ్యాలనే వైసిపీ వాళ్లకి దొంగ వ్యాపారాలు, దొంగ మైనింగ్, రకరకాల పత్రికలు, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా లాంటివి ఆదాయ వనరులుగా చేసుకుని డబ్బు సంపాదించవచ్చు. కానీ పవన్ గారు తనకి నచ్చిన వృత్తిని, ఆదాయ మార్గంగా చేసుకొని సినిమాల్లో నటిస్తున్నారు. భారతదేశం యొక్క సంస్కృతిని, ఔనత్యాన్ని నిలబెడుతున్న వీరమల్లు లాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నందుకు బ్యాన్ అంటున్నారా. వాళ్ళకి వాళ్ళు చేసే దొంగతనం పనులు చూపిస్తున్న సినిమాలు నచ్చుతాయేమో అని చెప్పుకొచ్చాడు.