హిందీలో 100 కోట్ల మార్కును దాటిన 'ఆర్ఆర్ఆర్'!
రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా యస్.యస్. రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ 'ఆర్ఆర్ఆర్' హిందీలోనూ అఖండ విజయం సాధించింది. విడుదలైన ఐదు రోజులకే రూ. 100 కోట్ల మార్కును దాటి, రూ. 200 కోట్ల లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా హిందీ వెర్షన్ ఐదో రోజు మంగళవారం రూ. 15.02 కోట్ల నెట్‌ను సాధించింది.