Read more!

English | Telugu

విద్యా బాల‌న్ `క‌హానీ`కి ప‌దేళ్ళు!

ఎలాంటి పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోయే న‌టీమ‌ణుల్లో విద్యా బాల‌న్ ఒక‌రు. సిల్క్ స్మిత జీవితం స్ఫూర్తితో రూపొందిన `ద డ‌ర్టీ పిక్చ‌ర్` (2011) కోసం త‌న కెరీర్ లో ఎన్న‌డూ లేని విధంగా ఎంతో గ్లామ‌రస్ గా క‌నిపించి `ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్` ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విద్య‌.. ఆపై కేవ‌లం మూడు నెల‌ల త‌రువాత `క‌హానీ` (2012)తో ప‌ల‌క‌రించి వెంట‌నే మ‌రో మ‌ర‌పురాని విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. `ద డ‌ర్టీ పిక్చ‌ర్`కి భిన్నంగా, గ్లామ‌ర్ కి ఏ మాత్రం అవ‌కాశం లేని పాత్ర‌లో క‌నిపించి మ‌రీ ఈ స‌క్సెస్ సొంతం చేసుకున్నారు విద్యా బాల‌న్. అనూహ్య క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన ఈ థ్రిల్ల‌ర్ మూవీలో విద్యా బాగ్చి పాత్ర‌లో త‌న అభిన‌యంతో ఇంప్రెస్ చేశారు ఈ నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్ర‌స్.

సుజ‌య్ ఘోష్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం తొలి రోజు ఆశించిన వ‌సూళ్ళు రాబ‌ట్ట‌లేక‌పోయినా.. మౌత్ టాక్ తో క్ర‌మంగా `సూప‌ర్ హిట్` స్టేట‌స్ కి చేరుకుంది. బాలీవుడ్ క్లాసిక్స్ లో ఒక‌టిగా నిలిచింది. `బెస్ట్ స్క్రీన్ ప్లే` (సుజయ్ ఘోష్), `బెస్ట్ ఎడిటింగ్` (న‌మ్ర‌తా రావు), `స్పెష‌ల్ జ్యూరీ అవార్డ్` (న‌వాజుద్ధీన్ సిద్ధిఖి) విభాగాల్లో `జాతీయ‌` పుర‌స్కారాల‌ను అందుకున్న `క‌హానీ`.. `బెస్ట్ డైరెక్ట‌ర్`, `బెస్ట్ యాక్ట్ర‌స్`, `బెస్ట్ సౌండ్ డిజైన్`(సంజ‌య్ మౌర్య‌, ఆల్విన్ రేగో), `బెస్ట్ ఎడిటింగ్`, `బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ` (సేతు) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తెలుగులో `అనామిక‌` (2014) పేరుతో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార టైటిల్ రోల్ లో శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అలాగే 2016లో విద్యా బాల‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారిణిగా సుజ‌య్ ఘోష్ ద‌ర్శ‌క‌త్వంలోనే `క‌హానీ 2ః దుర్గా రాణి సింగ్` పేరుతో ఈ సినిమాకి స్పిరిచ్యుయ‌ల్ సీక్వెల్ కూడా రావ‌డం విశేషం. కాగా, 2012 మార్చి 9న విడుద‌లైన `క‌హానీ`.. నేటితో ప‌దేళ్ళు పూర్తిచేసుకుంది.