English | Telugu
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
Updated : Mar 21, 2022
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని సోనమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్తలో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. "నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం. నీపై ఒక కుటుంబం ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు కురిపిస్తుంది. రెండు హృదయాలు నీతో కలిసి అడుగడుగునా స్పందిస్తాయి. నాలుగు చేతులు నిన్ను ఉత్తమంగా పెంచడానికి ప్రయత్నిస్తాయి" అంటూ పుట్టబోయే బేబీ గురించి పోస్ట్ పెట్టింది.
బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అయిన సోనమ్.. 2007 లో వచ్చిన 'సావరియా' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ రెండేళ్లుగా సినిమాలు తగ్గించింది. తాజాగా తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమెకు సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
సోనమ్ రీసెంట్ గా 'బ్లైండ్' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించింది. కొరియన్ ఫిల్మ్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుంది.