Read more!

English | Telugu

హిందీ 'రాధే శ్యామ్' 4 రోజుల‌కు క‌లెక్ట్ చేసింది ఇంతే!

 

ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించ‌గా రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన 'రాధే శ్యామ్' మూవీ విడుద‌లై 5వ రోజు న‌డుస్తోంది. గోపీకృష్ణా మూవీస్‌, యువి క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి తొలిరోజే మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. అది క‌లెక్ష‌న్ల‌లోనూ రిఫ్లెక్ట్ అవుతోంది. తెలుగు వెర్ష‌న్‌తో పోలిస్తే 'రాధే శ్యామ్' హిందీ వెర్ష‌న్ క‌లెక్ష‌న్లు మ‌రీ తీసిక‌ట్టుగా ఉన్నాయి. సోమ‌వారం నాలుగో రోజు ఈ సినిమాకు వ‌చ్చింది కేవ‌లం రూ. 1.55 కోట్ల నెట్ మాత్ర‌మే. దీంతో విడుద‌లైన నాలుగు రోజుల‌కు హిందీ 'రాధే శ్యామ్' వ‌సూలు చేసింది రూ. 15. 82 కోట్లు (నెట్‌). 

ఫ‌స్ట్ పాన్ ఇండియా స్టార్‌గా అంద‌రూ కీర్తిస్తోన్న ప్ర‌భాస్ సినిమా హిందీ వెర్ష‌న్‌కు ఇంత త‌క్కువ వ‌సూళ్లు న‌మోద‌వుతుండ‌టంతో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఆందోళ‌న‌లో మునిగిపోయారు. హిందీలో ఈ మూవీని టి-సిరీస్ నిర్మించింది. ప్రి బిజినెస్ వాల్యూకూ, వ‌స్తున్న క‌లెక్ష‌న్ల‌కు ఏమాత్రం పొంత‌న లేక‌పోవ‌డం విశ్లేష‌కుల్ని సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

'బాహుబ‌లి'తో వ‌చ్చిన అమేయ‌మైన ఇమేజ్ త‌ర్వాత ఎలాంటి స‌బ్జెక్టుల్ని ఎంచుకోవాల‌నే విష‌యంలో ప్ర‌భాస్ క‌న్‌ఫ్యూజ‌న్‌కు గుర‌వుతున్నాడ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. 'రాధే శ్యామ్‌'తో ప్ర‌భాస్ ఇమేజ్‌కు దేశ‌వ్యాప్తంగా డామేజ్ జ‌రిగింద‌ని వారు బాధ‌ప‌డుతున్నారు. ఈ త‌ర‌హా స‌బ్జెక్టులు ఎంచుకోవ‌ద్దంటూ సోష‌ల్ మీడియా ద్వారా వారు కోరుతున్నారు.