English | Telugu
'బ్రహ్మాస్త్ర' షూటింగ్ కంప్లీట్.. రాజమౌళి, నాగార్జున ఏం చేస్తారో!
Updated : Mar 29, 2022
బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పలు భాగాలుగా తెరకెక్కనుంది. బ్రహ్మాస్త్ర పార్ట్-1 'శివ' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా పార్ట్-1 షూటింగ్ కూడా పూర్తయింది.
కాశీలో జరిగిన చివరి షెడ్యుల్ తో 'బ్రహ్మాస్త్ర పార్ట్-1' షూటింగ్ పూర్తయిందని మూవీ టీమ్ తాజాగా తెలిపింది. ఈ సందర్భంగా రణ్ బీర్, ఆలియా, అయాన్ కలిసి కాశీలోని ఆలయంలో దిగిన ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల 'పుష్ప' నార్త్ లో కలెక్షన్లు కొల్లగొట్టగా.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఏకంగా 'బాహుబలి-2' రికార్డులనే బ్రేక్ చేసే దిశగా పరుగులు తీస్తోంది. ఇదే బాటలో ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు సౌత్ లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి.
బ్రహ్మాస్త్ర పార్ట్-1 సెప్టెంబర్ 9 న హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విదులైన మోషన్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ పవర్స్ కలిగిన శివ అనే యువకుడి పాత్రలో రణ్ బీర్ కనిపించనున్నాడు. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సౌత్ లో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటం విశేషం. మరి రాజమౌళి బ్రాండ్, నాగార్జున కీ రోల్ తో ఈ సినిమా ఇక్కడ భారీ కలెక్షన్స్ రాబడుతుందేమో చూడాలి.